కల్వకుంట్ల కవిత ను కూతురు అని కూడా చూడకుండా కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. తండ్రి కేసీఆర్ తనని సస్పెండ్ చేసేలా చేసుకుంది కవితనే. అందుకే ఆమె తీహార్ జైలు నుంచి వచ్చాక పార్టీ కార్యకలాపాల్లో అంటీముట్టనట్టుగా పాల్గొంటూనే బీఆర్ఎస్ లో కొంతమంది నేతలను స్వయానా అన్న కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ వచ్చింది. హరీష్ రావు, సంతోష్ రావు లు కుట్ర పన్నారని తనని పార్టీ నుంచి వెళ్లగొట్టె ప్లాన్ చేసారంటూ కవిత బహిరంగ ఆరోపణలు చేసింది.
దానితో కేసీఆర్ కూతురు కవితను పార్టీ నుంచి బహిష్కరించారు. కవిత కూడా తనని పార్టీ నుంచి ఎప్పుడెప్పుడు బయటికి పంపిస్తారా అని ఎదురు చూసి ఫైనల్ గా పార్టీ నుంచి వేటు పడగానే ఎమ్యెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసింది. ఆతర్వాత ఆమె ఏ పార్టీలో చేరడం లేదు అని క్లారిటీ ఇచ్చేసింది.
అయితే కొత్త పార్టీ పెట్టే దిశగా కవిత అడుగులు వెయ్యబోతుంది అనే వార్తల నేపథ్యంలో తెలంగాణ కోసం కష్టపడి పట్టుబట్టి దానిని సాధించి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన కేసీఆర్ ని కవిత కొత్త పార్టీ పెట్టి ఎదుర్కోగలదా, తండ్రి రాజకీయం ముందు కవిత నిలబడగలదా, అసలు కవిత పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి ల మధ్యన మనుగడ సాధించగలదా అనే సందేహాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క తెలంగాణ ఉద్యంలో ప్రముఖ పాత్ర వహించిన కవితను తక్కువ అంచనా వెయ్యలేము, ఆమెకు కేసీఆర్ కి ఉన్న తెలివితేటలు ఉన్నాయనే మాట వినబడుతుంది.