ఘాటీ సినిమా విడుదల రేపే. సెప్టెంబర్ 5 శుక్రవారం అనుష్క నటించిన ఘాటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అరుంధతి, దేవసేన గా ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టించుకున్న అనుష్క సైజ్ జీరో తర్వాత మీడియా ముందుకు రావడం తగ్గించేసింది. ఆమె బరువు ఆమెను ఇబ్బంది పెట్టడంతో సినిమాలు చేస్తుంది కానీ ప్రమోషన్స్ కి రాను అని చెప్పేస్తుంది.
తాజాగా ఘాటీ ప్రమోషన్స్ కు కూడా అనుష్క రాకుండా ఫోన్ ఇంటర్వూస్ ఇస్తుంది. ఇలా అయితే అనుష్క సినిమా కు క్రేజ్ ఏమొస్తుంది అనేవాళ్ళు లేకపోలేదు. కానీ అనుష్క మాత్రం ఇది నా పర్సనల్, నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రమోషన్స్ కి, అలాగే మా కుటుంబ ఫంక్షన్స్ కి, పెళ్లిళ్లకు, ఈవెంట్స్ కి వెళ్లడం మానేసాను అంటూ చెప్పిన అనుష్క ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నా అంది.
అయితే అనుష్క ఆడియో ఇంటర్వూస్ ప్రేక్షకులకు ఎంత రీచ్ అవుతున్నాయో మేకర్స్ కి అర్ధం కావడం లేదు. ఎందుకంటే రేపు విడుదల కాబోతున్న ఘాటీ బుకింగ్స్ ఓపెన్ అయినా టికెట్స్ తెగడం లేదు. బుక్ మై షో లో ఘాటీ టికెట్స్ కోసం ఓపెన్ చేస్తే థియేటర్స్ అన్ని ఖాళీ. మరి లాంగ్ వీకండ్ లో ఘాటీ పెరఫార్మెన్స్ బావుండాలి అంటే సినిమాకి హిట్ టాక్ రావాల్సిందే. చూద్దాం అనుష్క ఘాటీ పరిస్థితి ఏమిటి అనేది.