అనుష్క నటించిన ఘాటీ రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఘాటీ కి అనుష్క ప్రమోషన్స్ చెయ్యకపోవడం పై చాలామందిలో చాలా రకాల అనుమానాలు ఉండడంతో ఘాటీ కి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అని మేకర్స్ టెన్షన్ పడుతున్నారు. కేవలం ఫోన్ ప్రమోషన్స్ తో అనుష్క మ్యానేజ్ చేస్తుంది.
అందుకే ఘాటీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించడం లేదు అనే టాక్ వినిపించడంతో మేకర్స్ అలెర్ట్ అయ్యారు. అందుకే ప్రభాస్ ని రంగంలోకి దించారు. అనుష్క కి బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్. గతంలో వీరి మద్యన ప్రేమ ఉంది అనే ప్రచారం ఉంది. వారు ఎన్నిసార్లు ఖండించినప్పటికి ప్రభాస్-అనుష్క లు లవ్ లో ఉన్నారనే వార్తలు వినబడుతూనే ఉన్నాయి.
అందుకే ఘాటీ మేకర్స్ తెలివిగా విడుదలకు ముందు ప్రభాస్ ని దించి రిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేయించారు. ఘాటీ సినిమా ట్రైలర్ ఆకట్టుకుందని, ఇంటెన్స్ గా ఉండి ఆసక్తి కలిగించిందని ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. ఘాటీ టీమ్ అందరికీ మంచి సక్సెస్ రావాలని ప్రభాస్ విషెస్ తెలిపారు. ఇలాంటి పవర్ ఫుల్ రోల్ లో అనుష్కను స్క్రీన్ మీద చూసేందుకు వెయిట్ చేస్తున్నానని ప్రభాస్ తన పోస్ట్ లో పెట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఏమైనా ఘాటీ ని సపోర్ట్ చేస్తారేమో చూడాలి.