Advertisementt

ఇది పవన్ OG రేంజ్

Wed 03rd Sep 2025 09:26 PM
pawan kalyan  ఇది పవన్ OG రేంజ్
This is Pawan OG range ఇది పవన్ OG రేంజ్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ట్రేడ్ లోనే కాదు పవన్ ఫ్యాన్స్ లోను OG పై విపరీతమైన క్రేజ్ ఉంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బర్త్ డే కి విడుదలైన OG గ్లింప్స్ ఫ్యాన్స్ తో పాటుగా కామన్ ఆడియన్స్ ను సైతం ఆకట్టుకుంది. ఇమ్రాన్ హష్మీ విలనిజం, పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ లుక్ అన్ని ఫ్యాన్స్ కు భీభత్సంగా నచ్చేసాయి. 

ప్రస్తుతం OG పై ఎంత క్రేజ్ ఉందొ అనేది చెప్పడం కష్టం. ఇప్పటికే ఓవర్సీస్ లో OG బుకింగ్స్ ఓపెన్ అవడంతో రికార్డ్ స్థాయిలో OG టికెట్స్ తెగుతున్నాయి. దీనిని బట్టే OG రేంజ్ ఏమిటి అనేది అర్ధమవుతుంది. దర్శకుడు సుజిత్ అభిమానులకు పవన్ ని ఎలా చూపిస్తే ఇష్టాపడతారో.. ఫ్యాన్స్ పల్స్ ఆయన కరెక్ట్ గా క్యాచ్ చేశారు అనిపించేలా OG లుక్స్, ఆ సినిమా నేపథ్యం ఉంది. 

ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి OG పై ఎంత క్రేజ్ ఉందొ అనేది ఈ చిన్న ఉదాహరణ చూస్తే తెలుస్తుంది. పవన్ బర్త్ డే సందర్భంగా  పవన్ ఫ్యాన్స్ నిర్వహించిన ఓ ఆన్‌లైన్ వేలంలో OG సినిమా తొలి టికెట్‌ను ఏకంగా రూ. 5 లక్షలకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు. అంతేకాదు ఆ భారీ మొత్తాన్ని అభిమానులు జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించడం విశేషం.

ఎక్స్ స్పేసెస్ పేరుతొ వేసిన ఈవేలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ ఫ్యాన్స్ పాల్గొనడం ఇంకా ఆశ్చర్యకర విషయం. ఈ వేలంలో టీమ్ పవన్ కల్యాణ్ నార్త్ అమెరికా ఈ ఐదు లక్షల బిడ్ ను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

This is Pawan OG range:

OG: Pawan Kalyan fans make history

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ