Advertisementt

మృణాల్ ఠాకూర్ పై భారీ ట్రోలింగ్

Wed 03rd Sep 2025 08:52 PM
mrunal thakur  మృణాల్ ఠాకూర్ పై భారీ ట్రోలింగ్
Massive trolling on Mrunal Thakur మృణాల్ ఠాకూర్ పై భారీ ట్రోలింగ్
Advertisement
Ads by CJ

ఈ మధ్యన మృణాల్ ఠాకూర్ తరచు వివాదాల్లో చిక్కుకుంటుంది. కొద్ది రోజుల క్రితం బిపాషా బసుపై చేసిన వ్యాఖ్యలు మృణాల్ ఠాకూర్ ను ట్రోల్ కి గురయ్యేలా చేసాయి. దానితో మృణాల్ ఠాకూర్ క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ మరోసారి అలాంటి వివాదాన్నే కొని తెచ్చుకుంది. 

విరాట్ కోహ్లీ అంటే పిచ్చి అంటూ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదం లేకపోయినా ఆయన భార్య ప్రముఖ నటి అనుష్క శర్మ పై మృణాల్ ఠాకూర్ చేసిన ఇండైరెక్ట్ వ్యాఖ్యలు మాత్రం ఆమెను ట్రోలింగ్ కి గురయ్యేలా చేసాయి. స‌ల్మాన్ ఖాన్ సుల్తాన్ లో తనకే మొదట హీరోయిన్ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని.. కానీ అప్పుడు తను ఆ సినిమా చేసేందుకు సిద్ధంగా లేకపోవడంతో ఆ సినిమాను వదులుకోవడంతో మరో నటి(అనుష్క శర్మ) వచ్చింది. అయితే సుల్తాన్‌ సూపర్ హిట్ అవ్వ‌డ‌మే కాదు అందులోని హీరోయిన్ కి స్టార్‌డ‌మ్‌ను తెచ్చిపెట్టింది. 

కానీ ఆ సినిమాలో న‌టించిన న‌టి (అనుష్క)ప్ర‌స్తుతం సినిమాలు చేయ‌డం కేసు, కానీ తాను మాత్రం వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ప్ర‌స్తుతం బిజీగా ఉన్నాన‌ని మృణాల్ ఠాకూర్ అనుష్క శర్మను ఉద్దేశించి కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ లో మృణాల్ అనుష్క పేరు చెప్పకపోయినా.. సుల్తాన్ నటి అంటే అనుష్క శర్మ నే. 

ఆమె ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ కోసం నటనకు దూరంగా ఉంది. తన లైఫ్ లో తను హ్యాపీ గా ఉంటే అనుష్క శర్మ పై మృణాల్ ఇలాంటి కామెంట్స్ చేస్తుందా అని అనుష్క అభిమానులు, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మృణాల్ ఠాకూర్ ని సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ చేస్తూన్నారు. 

Massive trolling on Mrunal Thakur:

Why Mrunal Getting So Much Hate

Tags:   MRUNAL THAKUR
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ