Advertisementt

పవన్ బర్త్ డే కి OG నుంచి పవర్ ఫుల్ పోస్టర్

Tue 02nd Sep 2025 10:24 AM
pawan  పవన్ బర్త్ డే కి OG నుంచి పవర్ ఫుల్ పోస్టర్
OG unleashes Fire on Pawan B-Day పవన్ బర్త్ డే కి OG నుంచి పవర్ ఫుల్ పోస్టర్
Advertisement
Ads by CJ

ఈరోజు సెప్టెంబర్ 2. అంటే పవర్ స్టార్ బర్త్ డే. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే అభిమానులకు పండగ రోజు. పవన్ కళ్యాణ్ బర్త్ డే కి కేక్ కటింగ్స్, కటౌట్ కి పాలాభిషేకాలు, బ్యానర్ లు కట్టి సంబరాలు చేసుకుంటారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల ట్రీట్స్ తో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తూ అద్దరగొట్టేస్తారు. 

ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి హరీష్ శంకర్ వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందించేసారు. ఇక సుజిత్ కూడా OG నుంచి ఈరోజు సాయంత్రం 4 గంటలకు సూపర్ ట్రీట్ సిద్ధం చేసారు. అంతలోనే పవర్ ఫుల్ పోస్టర్ OG నుంచి విడుదల చేస్తూ పవన్ కి విషెస్ తెలియజేసారు. 

కార్ పై OG గా గ్యాంగ్ స్టర్ లుక్ లో పవన్ లుక్ చూసి పవన్ ఫ్యాన్స్ కు పూనకలొచ్చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వింటేజ్ స్వాగ్ లుక్ చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. మరి సాయంత్రానికి OG నుంచి ఎలాంటి ట్రీట్ రాబోతుందో అని పవన్ ఫ్యాన్స్ అప్పుడే గంటలు నిముషాలు లెక్కెట్టేస్తున్నారు.

OG unleashes Fire on Pawan B-Day:

OG makers wish Pawan Kalyan with a fiery poster on B-Day

Tags:   PAWAN
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ