Advertisementt

వీర‌మ‌ల్లు బ్యూటీ ర‌హ‌స్య పెళ్లి గుట్టు ర‌ట్టు

Tue 02nd Sep 2025 11:17 AM
nargis fakhri  వీర‌మ‌ల్లు బ్యూటీ ర‌హ‌స్య పెళ్లి గుట్టు ర‌ట్టు
Alleged Couple Nargis Fakhri And Tony Reportedly Got Married Secretly వీర‌మ‌ల్లు బ్యూటీ ర‌హ‌స్య పెళ్లి గుట్టు ర‌ట్టు
Advertisement
Ads by CJ

ఇటీవ‌లే ప‌వ‌న్ క‌ల్యాణ్ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` చిత్రంలో త‌న‌దైన అందం- ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకుంది న‌ర్గీస్ ఫ‌క్రి. అక్ష‌య్ కుమార్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `హౌస్ ఫుల్ 5` లోను ఈ భామ న‌టించింది. టాలీవుడ్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి పెద్ద హీరోతో లాంచ్ అయింది.  బాలీవుడ్ లో రాక్ స్టార్, కిక్ లాంటి చిత్రాల్లోను న‌ర్గీస్ న‌టించింది.

ఈ భామ కొంత‌కాలంగా బాలీవుడ్ నుంచి నిష్కృమించ‌డం షాకిచ్చింది. అనూహ్యంగా లైమ్ లైట్ నుంచి దూరంగా అదృశ్యమైన‌ ఈ బ్యూటీ స‌డెన్ గా హౌస్ ఫుల్ 5, వీర‌మ‌ల్లు చిత్రాల‌తో మ‌ళ్లీ క‌నిపించింది. కానీ ఇప్పుడు న‌ర్గీస్ ఫ‌క్రీ గురించిన టాప్ సీక్రెట్ రివీల‌వ్వ‌డం అంద‌రికీ షాకిస్తోంది. న‌ర్గీస్ ప్ర‌ముఖ బిజినెస్ మేన్ ని ర‌హ‌స్యంగా పెళ్లాడేసింది. 

ఈ ర‌హ‌స్యాన్ని ద‌ర్శ‌కురాలు ఫ‌రాఖాన్ లీక్ చేసారు. న‌ర్గీస్ టోనీ బేగ్ అనే వ్యాపార‌వేత్త‌ను పెళ్లాడిందని ఫ‌రా ప్ర‌క‌టించ‌డం షాకిచ్చింది. నీతా ముఖేష్ అంబానీ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో న‌ర్గీస్ ఫ‌క్రీ చెంత‌కు రావాల్సిందిగా టోనీని ఫ‌రా స్వ‌యంగా పిలిచారు. దీంతో ర‌హ‌స్య వివాహం గుట్టు ర‌ట్ట‌యింది. ఈ జంట‌ పెళ్లి ఈ ఏడాది ఫిబ్రవరి లో కాలిఫోర్నియాలో జరిగింద‌ని, స్విట్జర్లాండ్‌లో హనీమూన్ పూర్త‌యింద‌ని కూడా తెలుస్తోంది. అయితే పెళ్లికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా రివీల్ కాలేదు. త‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని ప్ర‌చారం చేసుకోవ‌డానికి న‌ర్గీస్ ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని కూడా తెలుస్తోంది.

Alleged Couple Nargis Fakhri And Tony Reportedly Got Married Secretly:

Nargis Fakhri makes first appearance with husband Tony Beig after secret wedding

Tags:   NARGIS FAKHRI
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ