Advertisementt

పార్వ‌తి మెల్ట‌న్ ప్రెగ్నెంటా ..

Tue 02nd Sep 2025 09:42 AM
parvathi melton  పార్వ‌తి మెల్ట‌న్ ప్రెగ్నెంటా ..
Parvati Melton pregnancy photos go viral పార్వ‌తి మెల్ట‌న్ ప్రెగ్నెంటా ..
Advertisement
Ads by CJ

ప‌వ‌న్ క‌ల్యాణ్ `జ‌ల్సా` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హీరోయిన్ గా పాపుల‌రైన‌ పార్వ‌తి మెల్ట‌న్, ఆ త‌ర్వాత కొన్ని ఫ్లాప్ సినిమాల్లో న‌టించి టాలీవుడ్ కి దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ మూవీ `జ‌ల్సా` క‌థానాయిక‌గా త‌న‌కు మంచి పేరు తెచ్చింది. ఇలియానాతో పోటీప‌డుతూ పార్వ‌తి నటించింది. కానీ ఆ త‌ర్వాత  మ‌హేష్ `దూకుడు`లో ఐటమ్ నంబ‌ర్ త‌ప్ప కెరీర్ కి క‌లిసొచ్చే ఒక్క అవకాశం కూడా రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ప్ర‌స్తుతం పార్వ‌తి మెల్ట‌న్ ఏం చేస్తోంది? అంటే దానికి స‌మాధానం ఇన్ స్టా వెతికితే ల‌భించింది. పార్వ‌తి మెల్ట‌న్ కొన్ని నెల‌లుగా కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్ల‌తో సోష‌ల్ మీడియాల్లో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. గ‌త  రెండు మూడు రోజులుగా పార్వ‌తి షేర్ చేస్తున్న ఫోటోషూట్లు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. పార్వ‌తి నిజానికి తెలుగు ప్ర‌జ‌ల‌కు, అభిమానుల‌కు ఏదో చెప్పాల‌నుకుంటోంది. దానికి త‌గ్గ‌ట్టే వ‌రుసగా త‌న బేబి బంప్ (ఫ్రెగ్నెన్సీ) ఫోటోల‌ను షేర్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. రెండు రోజ‌ల క్రితం షేర్ చేసిన ఓ స్పెష‌ల్ ఫోటోషూట్ లో త‌న బేబి బంప్ బ‌య‌ట‌ప‌డింది. ఈరోజు షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ లోను బంప్ స్ప‌ష్ఠంగా క‌నిపించింది. అయితే పార్వ‌తి త‌న ల‌వ్ లైఫ్ గురించి అంత‌గా వివ‌రాలు చెప్ప‌లేదు.. క‌నీస‌ ప్ర‌చారం చేయ‌లేదు కాబ‌ట్టి, ఈ స‌డెన్ స‌ర్ ప్రైజ్ నిజంగా షాకిస్తోంది.

కొండ‌లు .. పువ్వులు.. గాలి.. నేను మోస్తున్న‌ చిన్న హృద‌య స్పంద‌న‌తో .. అంటూ పార్వ‌తి ఏదో సీక్రెట్ ని చెప్ప‌క‌నే చెప్పేసింది. ఆమె మోస్తున్న చిన్న హృద‌యం! ఏమిటో అభిమానులు గ్ర‌హించాల్సి ఉంటుంది. అయితే పార్వ‌తి ఇప్ప‌టికీ దీని గురించి ఎలాంటి హింట్ ఇవ్వ‌లేదు. అయితే ఈ సస్పెన్స్ కు తెర దించుతూ స్వ‌యంగా ఇత‌ర వివ‌రాలేవైనా చెబుతుందేమో చూడాలి.

Parvati Melton pregnancy photos go viral:

Parvathi Melton baby bump photos go viral

Tags:   PARVATHI MELTON
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ