మొత్తానికి బీఆర్ఎస్ ను కల్వకుంట్ల కవిత నట్టేట ముంచేసింది. నడి సముద్రంలో కొట్టుకు చావాలని బీఆర్ఎస్ లో కవిత చేసిన పని కలకలం సృష్టించింది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్, హరీష్ రావు లు ఇరుక్కునేలా కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ తిరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో కవిత నేరుగా హరీష్ రావు ని టార్గెట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
మహానాయకుడు కేసీఆర్ పై అవినీతి ముద్ర వేయడానికి సీబీఐ ఎంక్వైరీ పెట్టడం చూసి నా గుండె మండిపోతోంది. నా తండ్రి కేసీఆర్‌కి తిండి, డబ్బు మీద ఎప్పుడూ ఆశ ఉండదు. తరతరాల సంపాదనను తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు. అసలు కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్‌కి మరక పడేలా చేసిన వారిలో మాజీ మంత్రి హరీష్‌రావు, సంతోష్ రావు కీలక పాత్ర పోషించారు.
అందుకే కేసీఆర్.. హరీశ్ రావును రెండో సారి ఇరిగేషన్ మంత్రిగా తొలగించారు. హరీష్‌రావు, సంతోష్ రావు కలిసి నా మీద కూడ కుట్ర పన్నారు.. ఎన్నడూ లేనిది మొదటిసారి వీరి పేర్లు బయటపెడుతున్నాయి.. నా ఈ వ్యాఖ్యల వలన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ష్టం జరగొచ్చు, కానీ నేను చూస్తూ ఊరుకోలేను అంటూ హరీష్‌రావు, సంతోష్ రావు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
మరోవైపు కవిత విషయంలో కేసీఆర్ సీరియస్ గా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కొడుకు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, పల్లా లతో మీటింగ్ పెట్టారు. కవితపై కఠినచర్యలు తీసుకునేందుకు సిద్దమవడంతో బీఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో కవితను అన్ ఫాలో చేస్తున్నారు.