Advertisementt

దేవరకొండ తో రష్మిక - హ్యాట్రిక్ మూవీ

Mon 01st Sep 2025 05:39 PM
vijay deverakonda  దేవరకొండ తో రష్మిక - హ్యాట్రిక్ మూవీ
Vijay Deverakonda and Rashmika Hat-Trick Movie confirmed దేవరకొండ తో రష్మిక - హ్యాట్రిక్ మూవీ
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ-కన్నడ సంచలనం రష్మిక కలిసి ఫస్ట్ టైమ్ గీత గోవిందం చిత్రంలో నటించారు. ఆతర్వాత వారి కలయికలో డియర్ కామ్రేడ్ వచ్చింది. డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ-రష్మిక డేటింగ్ లో ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి.. రష్మిక కూడా విజయ్ దేవరకొండ కి ఫ్యామిలీ ఫ్రెండ్ గా మారడంతో ఇద్దరూ వెకేషన్స్ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. 

అలా వారి నడుమ ప్రేమో, ఫ్రెండ్ షిప్పో అనేది క్లారిటీ లేకుండా అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్న సమయంలోనే విజయ్ దేవరకొండ-రష్మిక ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకుబోతున్నారనే వార్త చక్కర్లు కొట్టింది. మైత్రి మూవీస్ నిర్మించే చిత్రంలో వీరి కలయికను చూడొచ్చని అన్నారు. 

దర్శకుడిగా రాహుల్ సంకీర్త్యన్ తెరకెక్కించే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ-రష్మిక నటించనున్నారని అన్నారు. తాజాగా విజయ్ దేవరకొండ-రష్మిక కలయికలో మైత్రి మూవీస్ నిర్మించే VD 14 ఈరోజు నుంచే సైలెంట్ గా ఆరంభమైనట్లుగా టాక్. కింగ్ డమ్ విజయ్ ను నిరాశపరచడంతో విజయ్ దేవరకొండ సైలెంట్ గా రాహుల్ తో చెయ్యబోయే మూవీ సెట్ లోకి వెళ్లిపోయాడని అంటున్నారు. 

VD 14 షూటింగ్ మొదలు కాగా.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం వున్నట్లుగా తెలుస్తుంది. దీనితో పాటుగా విజయ్ దేవరకొండ మరో మూవీకి కమిట్ అయ్యాడు. 

Vijay Deverakonda and Rashmika Hat-Trick Movie confirmed:

Vijay Deverakonda and Rashmika Hat-Trick Movie Update

Tags:   VIJAY DEVERAKONDA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ