పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రేపు మంగళవారం సెప్టెంబర్ 2. పవర్ ప్యాకెడ్ అప్ డేట్స్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎదురు చూసే రోజు. పవన్ కళ్యాణ్ మరో 20 రోజుల్లో OG తో క్రేజీ గా దిగేందుకు సిద్ధమవుతున్నారు. సుజిత్ దర్శకత్వంలో దానయ్య నిర్మిస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై భీబత్సమైన అంచనాలుండగా.. హరిష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ లోను పవన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఉస్తాద్ షూటింగ్ కూడా పవన్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.
మరి OG నుంచి పవన్ బర్త్ డే కి ఎలాగూ ట్రీట్ ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా అద్భుతమైన కాదు కాదు ఫుల్ మీల్స్ ని ఈరోజు విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. అన్నట్టుగానే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫుల్ మీల్స్ వచ్చేసింది. USTAAD of style, swag and box office - POWER STAR అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ వింటేజ్ లుక్ పోస్టర్ తో పవన్ కళ్యాణ్ కి విషెస్ చెప్పేసారు.
పవన్ కళ్యాణ్ డాన్స్ చేస్తున్న వింటేజ్ లుక్ ని ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ బర్త్ డే స్పెషల్ గా అభిమానుల కోసం వదులుతూ.. పవన్ కళ్యాణ్ కి ఉస్తాద్ యూనిట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది.