మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం జూన్ 27 న పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి లెజెండరీ యాక్టర్స్ కన్నప్ప లో భాగం కావడంతో సినిమాపై క్రేజ్ ఏర్పడింది. కన్నప్ప థియేటర్స్ లో విడుదలయ్యాక మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
అయితే కన్నప్ప థియేటర్స్ లో విడుదలై రెండు నెలలు కావొస్తున్నా ఆ సినిమా ఓటీటీ ఎంట్రీ పై సందిగ్దత నెలకొంది. ఇప్పడు కన్నప్ప మేకర్స్ ఆ సస్పెన్స్ కు తెరదించి కన్నప్ప ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేసారు. సెప్టెంబర్ 4 నుంచి కన్నప్ప అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి స్ట్రీమింగ్ లోకి రానుంది.
మరి థియేటర్స్ లో మిస్ అయిన కన్నప్ప ను అమెజాన్ ప్రైమ్ లో చూసేందుకు ఆడియన్స్ మరో రెండు రోజులు వెయిట్ చేస్తే సరి.