మలయాళ కుట్టి కళ్యాణ్ ప్రియదర్శన్ ఇప్పటివరకు సక్సెస్ కోసం వెయిట్ చేస్తూనే ఉంది. ఎన్ని సినిమాలు చేసినా అమ్మడు పేరు మాత్రం పాపులర్ అవ్వడమే లేదు. తెలుగులో అఖిల్ హలొ సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ ఆతర్వాత రణరంగంతోనూ భారీ డిజాస్టర్ అందుకుని తెలుగు నుంచి మాయమైపోయింది.
కళ్యాణి ప్రియదర్శన్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న అమ్మాయి. ఆమె తండ్రి ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్. అయినప్పటికీ కల్యాణికి ఏ సినిమా ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ పరచలేదు. కళ్యాణి ప్రియదర్శన్ లోక చాప్టర్ 1 చంద్ర చిత్రం రీసెంట్ గా విడుదలైంది. దుల్కర్ సల్మాన్ బ్యానర్ లో లోక చాప్టర్ 1 చంద్ర అంటూ కళ్యాణి ప్రియదర్శన్ ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
లోక చాప్టర్ 1 చంద్ర చిత్రాన్ని చూసిన ఆడియన్స్ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ చూపిస్తున్నారు. అంతేకాదు క్రిటిక్స్ కూడా డీసెంట్ రివ్యూస్ ఇవ్వడం, పబ్లిక్ నుంచి పాజిటివ్ టాక్ రావడం లోక చాప్టర్ 1 చంద్ర థియేటర్స్ కళకళలాడుతున్నాయి. లోక చాప్టర్ 1 చంద్ర అంటూ టైటిల్ తో కాస్త కన్ఫ్యూజ్ చేసినా.. సినిమాపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ కనిపించడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
తెలుగులో లోక చాప్టర్ 1 చంద్ర చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార బ్యానర్ పై విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి లోక తో కళ్యాణి ప్రియదర్శన్ 100 కోట్ల క్లబ్బులోకి చేరిపోయి బిగ్ షాక్ ఇచ్చింది. అంచనాలు లేకుండా లోక తో కళ్యాణి ప్రియదర్శన్ మాంచి హిట్ కొట్టేసింది.