హీరోయిన్ నివేత పేతురేజ పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమైంది. హీరోయిన్ గా క్రేజీ గా మారలేకపోయిన నివేత పేతురేజ్ ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు సిద్దమవడమే కాదు తాను ప్రేమలో ఉన్న విషయాన్నీ బయటపెట్టింది. దుబాయ్ వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్‌తో ప్రేమలో ఉన్నట్లుగా ఫొటోలతో సహా గుట్టు విప్పింది.
ఐదేళ్ల క్రితమే దుబాయిలో ఓ రేసింగ్ సందర్భంగా రజిత్ ఇబ్రాన్‌తో తనకు పరిచయమైందని, మొదట్లో స్నేహితులుగానే ఉన్నామని, ఆ తర్వాత లవర్స్ గా మారామని చెప్పిన నివేత పేతురేజ్ ఈ విషయం తన సన్నిహితుల్లోని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు అని, సినిమా ఇండస్ట్రీలోనూ ఎవరికీ ఈ విషయం తెలియదని, తన ప్రేమ గురించి బయటపెట్టడం తన మేనేజర్ తో పాటుగా అందరికి షాకింగ్ అని చెప్పుకొచ్చింది.
అంతేకాదు తమ పెళ్లి ప్లాన్స్ ను కూడా రివీల్ చేసింది. ప్రస్తుతం పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేశామని, అక్టోబరులో నిశ్చితార్థం చేసుకుంటామని రాబోయే జనవరిలో పెళ్లి ఉంటుంది, కానీ పెళ్లి తేదీ ఇంకా నిర్ణయం కాలేదు అని, పెద్దల అంగీకారంతో ఈ పెళ్లి జరుగుతుంది, తమ ఇద్దరి కుటుంబాలు దుబాయిలో ఉంటున్నాయని, అలానే తమ వివాహాన్ని సింపుల్ గా స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో చేసుకుంటామని నివేత పేతురేజ పెళ్లి విషయాలను దాదాపుగా బయటపెట్టేసింది.