నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ తాండవం షూటింగ్ ముగించే పనిలో ఉన్నారు. ఆ చిత్రం ఫినిష్ కాగానే ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వం లో NBK 111, అదే సమయంలో క్రిష్ తో ఆదిత్య 369 సీక్వెల్ చేస్తారని అంటున్నారు. గోపీచంద్ మలినేని తో మూవీ అనౌన్సమెంట్ కూడా వచ్చేసింది. కానీ క్రిష్ తో ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు.
తాజాగా క్రిష్ ఘాటీ ప్రమోషన్స్ లో బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్ గురించి, అది ఎప్పుడు మొదలవుతుంది అని అడిగితే.. అది బాలకృష్ణ గారే చెప్పాలి, తాను ఆ సినిమా గురించి మాట్లాడలేనని కాస్త కన్యూజ్ చేసారు క్రిష్. అంతేకాదు మోక్షజ్ఞ ఆదిత్య 369 సీక్వెల్ లో కనిపిస్తాడని అంటున్నారు అది నిజమేనా అని అడిగితే ..
దానికి కూడా క్రిష్.. అది కూడా బాలయ్యే చెప్పాలన్నారు. ఏదైనా బాలయ్య నోటి నుంచే వినాలని క్రిష్ కుండబద్దలు కొట్టారు. మరోపక్క ఆయన స్నేహితుడు రాజీవ్ రెడ్డిని ఓ ఇంటర్వ్యూలో బాలయ్య-క్రిష్ కాంబో ఆదిత్య 369 సీక్వెల్ గురించి అడిగితే.. చర్చలు జరుగుతున్నాయని మాత్రమే చెప్పాడు అంతకుమించి ఏ విషయము బయటపెట్టకపోయేసరికి అందరూ బాలయ్య-క్రిష్ కాంబోపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.