యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో మార్చ్ లో మొదలైన డ్రాగన్ మూవీ పై ట్రేడ్ లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ పై కీలకమయిన యాక్షన్ సీక్వెన్స్ ను ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ తప్ప మిగతా నటులెవరు, అసలు ఎవరెవరు ఈ చిత్రంలో నటిస్తున్నారనే విషయంలో క్లారిటీ లేదు. మలయాళ హీరో తోవినో థామస్ ఎన్టీఆర్ కి విలన్ గా నటించనున్నాడనే ప్రచారం తో పాటుగా కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఎంపికయ్యింది అనే ప్రచారం జరుగుతుంది తప్ప ఎక్కడా అధికారిక ప్రకటన లేదు.
రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ సినిమాలో ఫిక్స్ అన్నా అఫీషియల్ అనౌన్సమెంట్ లేక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ సరసన డ్రాగన్ లో రుక్మిణి వసంత్ ఫిక్స్. అదే విషయాన్ని మదరాసి నిర్మాత ఎన్వీ ప్రసాద్ రివీల్ చేసారు. గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన మదరాసి ఈవెంట్ లో రుక్మిణి వసంత్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ని ఆయన బయటపెట్టారు.
రుక్మిణి వసంత్ ప్రస్తుతం మదరాశితో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆతర్వాత నెల గ్యాప్ లో కాంతార 1 తో ఆడియన్స్ ను పలకరిస్తుంది. అలాగే ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తుంది, ఇక కన్నడ హీరో యష్ టాక్సిక్ లోను రుక్మిణి వసంత్ నటిస్తుంది అంటూ ఆయన ఎన్టీఆర్ తో రుక్మిణి నటిస్తుంది అనే విషయాన్ని బయటపెట్టేయ్యడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
ఇక డ్రాగన్ చిత్రణకి గాను రుక్మిణి వసంత్ ఏకంగా కోటిన్నర పారితోషికంగా అందుకోబోతుందట. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న రుక్మిణి డిమాండ్ ని బట్టి తనను కలుస్తోన్న దర్శక నిర్మాతల్ని కూడా గట్టిగానే అడుగుతుంది అనే టాక్ వినబడుతుంది.