Advertisementt

సంక్రాంతి డేట్స్ పంచుకున్న ప్రభాస్ - చిరు

Mon 01st Sep 2025 10:32 AM
prabhas  సంక్రాంతి డేట్స్ పంచుకున్న ప్రభాస్ - చిరు
Prabhas The Raja Saab to release for Sankranti సంక్రాంతి డేట్స్ పంచుకున్న ప్రభాస్ - చిరు
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతికి రెండు సినిమాలు రావడానికి గట్టిగా ఫిక్స్ అయ్యాయి. అందులో ముందుగా ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ తేదీని నిర్మాత విశ్వ ప్రసాద్ ప్రకటించేసారు. పలుమార్లు వాయిదా పడిన రాజా సాబ్ డిసెంబర్ 5 నుంచి సంక్రాంతికి రిలీజ్ అనడమే కాదు దానికి డేట్ కూడా లాక్ చేసారు. జనవరి 9 న అంటూ రాజా సాబ్ డేట్ అనౌన్స్ చేసారు.

ఇక అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు కూడా సంక్రాంతి రిలీజ్ అంటూ ఓపెనింగ్ డే నుంచే చెబుతూ వచ్చారు. కానీ ఏ డేట్ కి వస్తుంది అని మాత్రం చెప్పలేదు. కానీ ఇప్పుడు చిరు కూడా జనవరిలో సంక్రాంతి పండుగ సీజన్ లో తేదీపై కచ్చిఫ్ వేశారు. అది జనవరి 14 న సంక్రాంతి ఫెస్టివల్ రోజున మన శంకర వర ప్రసాద్ గారు రాబోతున్నారు. త్వరలోనే ఈ డేట్ పై క్లారిటీ రానుంది.  

సంక్రాంతి సీజన్ కి అఖండ 2 కూడా రావొచ్చనే ఊహాగానాలు నడుస్తున్నాయి. మరి అఖండ 2 ఏ తేదీ ని సెలక్ట్ చేస్తుందో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఫైనల్ సంక్రాంతి సీజన్ లో ఇంకెన్ని సినిమాలు బరిలో దిగుతాయో అనేది కాస్త  వెయిట్ చేస్తే తెలుస్తుంది. 

Prabhas The Raja Saab to release for Sankranti:

Mana Shankara Varaprasad Garu movie is all set to release in theaters for Sankranthi 2026

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ