క్యూట్ అండ్ స్వీట్ బ్యూటీ శ్రీలీల మాస్ జాతర తో టాలీవుడ్ ని షేక్ చేస్తుంది అనుకుంటే ఆ సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్, టాలీవుడ్ భాషల్లో ఫుల్ బిజీ హీరోయిన్. టాలీవుడ్ లో ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకా అఖిల్ లెనిన్ చిత్రాల్లో నటిస్తున్న శ్రీలీల సోషల్ మీడియా పిక్స్ చూస్తే యూత్ కి మతిపోవాల్సిందే.
తాజాగా బ్లాక్ శారీ లో శ్రీలీల గత్తరలేపింది. బ్లాక్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్, నుదుటున బొట్టు, లూజ్ హెయిర్ శ్రీలీల మత్తెక్కించే చూపులతో కట్టి పడేసింది. ప్రస్తుతం శ్రీలీల బ్లాక్ శారీ లుక్ మాత్రం సోషల్ మీడియా లో విపరీతంగా హల్ చల్ చేస్తుంది.
ఇక బాలీవుడ్ లో శ్రీలీల రెండు ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. అందులో కార్తీక్ ఆర్యన్ తో లవ్ స్టోరీ లోను, రణ్వీర్ సింగ్ తో మరో క్రేజీ మూవీని ఓకె చేసింది అనే న్యూస్ ఉంది. మరోపక్క కోలీవుడ్ లోను శ్రీలీల అజిత్ కుమార్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది అంటుంటే.. అజిత్ పక్కన శ్రీలీల మరీ చిన్నపిల్లలా ఉంటుంది అనే కామెంట్స్ మొదలయ్యాయి.