Advertisementt

పిక్ టాక్: మెగా తోడికోడళ్ళు

Sun 31st Aug 2025 11:27 AM
anna lezhneva  పిక్ టాక్: మెగా తోడికోడళ్ళు
Pic Talk: Mega Thodi Kodallu పిక్ టాక్: మెగా తోడికోడళ్ళు
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పిక్ ఏది అంటే మెగా తోడికోడళ్లు సురేఖ, అన్న లెజెనోవా పిక్. నిన్న శనివారం అల్లు అరవింద్ గారి తల్లి, మెగాస్టార్ చిరు గారి అత్తగారు అల్లు కనకరత్నం గారు పరమపదించిన విషయం తెలిసి పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజెనోవా ఒంటరిగా అల్లు అరవింద్ ఇంటికి వచ్చారు. పవన్ కళ్యాణ్, నాగబాబు లు వైజాగ్ జనసేన మీటింగ్ లో ఉండడంతో వారు ఈ ఆదివారం అల్లు అరవింద్ ని పరామర్శించే అవకాశం ఉంది. 

అయితే తోడికోడలు సురేఖ తల్లి మరణించడంతో అన్న లెజెనోవా అల్లు అరవింద్ ఇంట్లో తోడికోడలు సురేఖతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఓదార్చిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాగబాబు భార్య పద్మజ వెనుకగా కూర్చోగా అన్న లెజెనోవా, చిరు భార్య సురేఖలు ఒకేచోట కూర్చోవడమే కాదు అన్న లెజెనోవా బుగ్గలు పట్టుకుని సురేఖ ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. 

ఆ పిక్ చూసి మెగా అభిమానులు మీ ఇద్దిరి కలియిక మాకెంతో సంతోషం, పిక్ ఆఫ్ ద డే, మెగా తోడికోడళ్లు అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

Pic Talk: Mega Thodi Kodallu:

Pawan Kalyan Wife Anna Lezhneva and Chiranjeevi Wife Surekha Visuals

Tags:   ANNA LEZHNEVA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ