Advertisementt

పెద్ది భామకు పెద్ద షాక్

Sun 31st Aug 2025 11:05 AM
janhvi kapoor  పెద్ది భామకు పెద్ద షాక్
Param Sundari Public Talk పెద్ది భామకు పెద్ద షాక్
Advertisement
Ads by CJ

దేవర చిత్రంతో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్.. ఆ చిత్రం విడుదల కాకముందే రామ్ చరణ్ తో పెద్ది లో ఛాన్స్ ఇచ్చారు. సౌత్ లో స్టార్ హీరోలతో ఛాన్స్ లు అందుకున్న జాన్వీ కపూర్ కి హిందీలో సక్సెస్ కోసం పోరాడుతూనే ఉంది. ప్రతిసారి జాన్వీ కపూర్ దండయాత్ర చేసినా జాన్వీ కి అక్కడ హిందీలో సక్సెస్ అందని పండులా మారిపోయింది. 

ఇప్పుడు సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి పరం సుందరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాన్వీ కపూర్ పరం సుందరిపై చాలా హోప్స్ పెట్టుకుంది. కాబట్టే ఈ పరం సుందరి పనిగట్టుకుని అందాలు ఆరబోస్తూ ప్రమోట్ చేసింది. రీసెంట్ గా విడుదలైన పరం సుందరికి  ఓపెనింగ్ రోజే పేక్షకులు షాకిచ్చారు. మొదటిరోజు పరం సుందరిని చూసేందుకు ఆసక్తి కనబరచలేదు. 

పరం సుందరి విడుదలయ్యాక టాక్ చూసి వెళదామనుకున్న ప్రేక్షకులకు పరం సుందరి పరం రొటీన్ అంటూ సోషల్ మీడియాలో కనిపించిన కామెంట్స్ తో సైలెంట్ అయ్యారు. కేరళ కుట్టిగా జాన్వీ కపూర్ పెరఫార్మెన్స్ బావున్నప్పటికీ.. సినిమా రొటీన్ ట్రీట్ మెంట్, పండని కామెడీ, సిద్దార్థ్ మల్హోత్రా రొటీన్ కేరెక్టర్ లో కనిపించాడు, కంటెంట్ వీక్ గా ఉండడంతో పరం సుందరి అసలు ఆకట్టుకోలేకపోయింది. 

పెద్ది చిత్రం ముందు జాన్వీ కపూర్ కి ఈ పరం సుందరి రిజల్ట్ షాకిచ్చింది. మరి పరం సుందరితో బాలీవుడ్ హిట్ అందుకుందామనుకున్న జాన్వీ కపూర్ కి పెద్ద షాక్ ఇచ్చింది. 

Param Sundari Public Talk:

Param Sundari Disappointing Day 1 Box Office Collection

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ