ఎన్టీఆర్ - నీల్ కలయికలో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా ఫిలిం డ్రాగన్(వర్కింగ్ టైటిల్). ఫుల్ స్వింగ్ లో చిత్రీకరణ జరుగుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కన్నడ భామ రుక్మిణి వసంత్ ని అనుకున్నారు కానీ.. ఇప్పటివరకు హీరోయిన్ విషయం రివీల్ చెయ్యకుండా మేకర్స్ ఊరిస్తున్నారు. అయితే ఆల్మోస్ట్ రుక్మిణి వసంత్ డ్రాగన్ లో హీరోయిన్ గా కన్ ఫర్మ్ అనే మాట వినిపిస్తుంది.
ప్రస్తుతం రుక్మిణి నటించిన తమిళ చిత్రం మదరాసి సెప్టెంబర్ 5 న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో రుక్మిణి వసంత్ చాలా చక్కగా బ్యూటిఫుల్ గా సంప్రదాయమైన డ్రెస్సులతో హాజరవుతుంది. తాజాగా ఆమె మదరాసి చెన్నై ఈవెంట్ లో పింక్ డ్రెస్ లో ట్రెడిషనల్ గా ఆకర్షణగా కనిపించి మతిపోగొట్టేసింది.
చూడముచ్చటగా బ్యూటిఫుల్ గా రుక్మణి కనిపించడంతో ఈ అందాన్ని ఎన్టీఆర్ పక్కన ఎప్పుడు చూస్తామా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూసేలా ఉంది.. అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ అమ్మడు ఎన్టీఆర్-నీల్ డ్రాగన్ సెట్ లోకి ఎప్పుడు అడుగుపెడుతుందో చూడాలి.