నటసింహా నందమూరి బాలకృష్ణ బ్రిటన్ కి చెందిన అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఆయన 50 ఏళ్లుగా కథానాయకుడిగా చేసిన సేవలకు గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్- యూకే లో గోల్డ్ ని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన సన్మాన కార్యక్రమంలో తమన్ మాట్లాడుతూ... ఎన్బీకే నటించిన అఖండ 2 అరుదైన సినిమా. ఈ చిత్రం రికార్డులు బ్రేక్ చేస్తుందని అన్నారు.
బాలయ్య బాబు స్వచ్ఛమైన మనిషి. ఆయన దగ్గరకు వెళితే తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది. ఆయన సినిమాకు పని చేయడం అంటే చేతిలో ఏవో మొలిచినట్టు అనిపిస్తుంది. మంచి సంగీతం రావడానికి ఇది సహకరిస్తుందని తమన్ అన్నారు. బాలయ్య నటించిన అఖండ సహా పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు తమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. తదుపరి బాలయ్య బాబు నటిస్తున్న అఖండ 2 కి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఎన్బీకే `లెజెండ్` సినిమా ప్రచార వేదికపై బోయపాటితో దేవీశ్రీ ప్రసాద్ ఘర్షణ గురించి తెలిసిందే. ఆ ఘర్షణ తర్వాత దేవీశ్రీ స్థానంలో తమన్ కి బోయపాటి అవకాశం కల్పిస్తున్నారు. ఆ తరవాత ఎన్బీకే తో అన్ని సినిమాలకు తమన్ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు.