ఏపీ రాజకీయాల్లో టీడీపీ ఎమ్యెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై హత్య ప్లాన్ చెయ్యడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కోసం రౌడీ షీటర్స్ ప్లాన్ చెయ్యడం సంచలనం సృష్టించింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని చంపితే డబ్బే డబ్బు అంటూ లీకయిన వీడియో హాట్ టాపిక్ అయ్యింది.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై హత్య కు ప్లాన్ చేసిన రౌడీ షీటర్స్ కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. ఓవైపు పోలీసుల ముమ్మర దర్యాప్తు.. మరోవైపు పొలిటికల్ ఫైట్‌తో నెక్ట్స్ ఏంటన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. తన హత్య కు నిజంగానే కుట్ర జరిగింది, ఆ కుట్ర కోణాన్ని పోలీస్ లే కనిపెట్టాలంటూ మాట్లాడిన కోటంరెడ్డి.. వైసీపీ నేతలు, రౌడీ షీటర్ల బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తేలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
మరోపక్క కోటంరెడ్డి కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడికి TDP శ్రేణులు.. ఎస్పీ, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరాచకశక్తులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ కేసును పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. నిన్ననే ముగ్గురు రౌడిషీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి పలు వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.