ప్రస్తుతం SSMB 29 షూటింగ్ ప్రోగ్రెస్ ఏమిటి అనేది తెలియక మహేష్ అభిమానులు అల్లాడిపోతున్నారు. రాజమౌళి డైరెక్ట్ గా నవంబర్ లోనే SSMB 29 ఇంఫార్మేషన్ ఇస్తాము, అప్పటివరకు వెయిట్ చెయ్యమని చెప్పారు. గత రెండు నెలలుగా SSMB 29 షూటింగ్ జరగడం లేదు. కెన్యాలో జరగాల్సిన షెడ్యూల్ వేరే దేశానికీ మారింది అనే ప్రచారం ఉంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ అలాగే ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ లు నటిస్తున్నారు.
అయితే తాజాగా ప్రియాంక చోప్రా తాను తీసిన కొన్ని నేచర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే.. ఆ పిక్స్ చూసిన వారంతా ఆ ప్లేస్ ని గుర్తుపడుతూ మీరు కెన్యాలో ఉన్నారా.. ఇది ఉత్తర ఆఫ్రికాలో తీసిన ఫొటోస్ కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ప్రియాంక ట్వీట్ కి సూపర్ స్టార్ భార్య నమ్రత రియాక్ట్ అవడం ఆసక్తికరంగా మారింది.
ప్రియాంక ట్వీట్ కి నమ్రత రియాక్ట్ అవుతూ.. లవ్ సింబల్ ఎమోజీలను పెట్టడంతో ప్రస్తుతం SSMB 29 షూటింగ్ ఆఫ్రికాలోని కెన్యాలో జరుగుతుంది అంటూ మహేష్ అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. ఇక SSMB టైటిల్ అలాగే ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను హాలీవుడ్ యాక్టర్ జేమ్స్ కామెరూన్ రివీల్ చెయ్యనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.