ఈ బర్త్ డే రోజునే తను ప్రేమించిన సాయి ధన్సికను వివాహం చేసుకోవాలనుకున్నారు హీరో విశాల్. అది నడిగర్ సంఘ భవనంలోనే తన పెళ్లి జరగాలని, అక్కడ జరిగే మొదటి పెళ్లి తనదే కావాలని విశాల్ పలుమార్లు చెప్పాడు. అయితే నడిఘర్ సంఘ భావన నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతోనే విశాల్ నిన్న చేసుకోవాల్సిన పెళ్లిని వాయిదా వేసుకుని తన పుట్టిన రోజు నాడు సాయి ధన్సికతో నిశితార్థం చేసుకున్నాడు.
వచ్చే ఏడాది కల్లా నడిఘర్ సంఘ భావన నిర్మాణం పూర్తవుతుంది.. అప్పుడు తాను ఆ భవనంలో సాయి ధన్సికను వివాహమాడతాను, అందుకే ఆగష్టు 29 న వివాహం చేసుకోలేదు, నడిఘర్ భవనంలో తన పెళ్లే మొదటిగా జరగాలని విశాల్ చెప్పుకొచ్చాడు. మరొక్క ఏడాదిలో విశాల్ పెళ్లి చేసుకుంటాడు.
అంటే వచ్చే ఆగష్టు 29 విశాల్ బర్త్ డే కల్లా విశాల్ సాయి ధన్సికను వివాహమాడి ఓ ఇంటివాడు అవుతాడన్నమాట.