నాగ్ ఎందుకింత ఆలోచన

Sat 30th Aug 2025 12:00 PM
nagarjuna  నాగ్ ఎందుకింత ఆలోచన
Nagarjuna landmark 100th film is set to be revealed soon నాగ్ ఎందుకింత ఆలోచన
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జున సోలోగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేందుకు ఎందుకింతగా ఆలోచిస్తున్నారు. గత ఆరు నెలలుగా తమిళ డైరెక్టర్ కార్తీక్ తనతో ట్రావెల్ చేస్తున్నారని, కథపై చర్చలు జరుగుతున్నాయని నాగార్జున చెప్పారు. తన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయే 100 వ ప్రాజెక్ట్ ని మరుపురాని మనం టైప్ లో ప్లాన్ చేస్తున్నట్టుగా నాగార్జునే రివీల్ చేసారు. అలాగే ఓపెనింగ్ కూడా  చేస్తున్నారు. 

మరి తన బర్త్ డే రోజున తన కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయే 100 వ చిత్రాన్ని అనౌన్స్ చేస్తారు అని అక్కినేని అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ కూడా వెయిట్ చేసారు. నిన్న శుక్రవారం నాగార్జున బర్త్ డే. కింగ్ నాగ్ కి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. 

కానీ చాలామంది మాత్రం ఆయన 100 వ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ లేదా పూజ కార్యక్రమాల కోసం వెయిట్ చెయ్యగా.. అది నాగ్ నుంచి రాకపోయేసరికి ఫుల్ గా డిజప్పాయింట్ అవ్వడమే కాదు.. తన సోలో ప్రాజెక్ట్, 100వ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చెయ్యడానికి నాగర్జున ఎందుకింతగా ఆలోచిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. 

రీసెంట్ గా కుబేర, కూలి చిత్రాల్లో నాగార్జున మెప్పించారు. సినిమాల రిజల్ట్ తో పని లేకుండా నాగార్జున కేరెక్టర్స్ ని ఆడియన్స్ లైక్ చేశారు. 

Nagarjuna landmark 100th film is set to be revealed soon:

As Nagarjuna turns one year older, fans awaiting an update on King100

Tags:   NAGARJUNA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ