సూపర్ స్టార్ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా గా సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. జయకృష్ణ కు జోడిగా బాలీవుడ్ భామ రవీనా టాండన్ కుమార్తె దిగుతుంది. ఇప్పుడు రమేష్ బాబు కుమర్తె కూడా సినిమాల్లోకి రాబోతుంది. రమేష్ బాబు కుమార్తె భారతి హీరోయిన్ గాఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది.
అది కూడా డైరెక్టర్ తేజ తనయుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. దర్శకుడు తేజ తనయుడి అరంగేట్ర చిత్రంలో హీరోయిన్ గా మహేష్ అన్న కుమార్తె భారతిని ఎంచుకొన్నారు. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో తేజ కొడుకు అలాగే భారతి పై కొంత మేర షూట్ జరిగింది.
ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు అని రమేష్ బాబు కొడుకు జయకృష్ణ తెలిపారు.