కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లి పీటలెక్కుతున్నాడు. సాయి ధన్సికను విశాల్ నిన్న ఆగష్టు 29 న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. విశాల్-సాయి ధన్సికలు ఎంగేజ్మెంట్ చేసుకున్న సందర్భంగా ఆ జంటకు శుభాకాంక్షలు తెలిపిన ప్రభాస్ ఫ్యాన్స్ త్వరలోనే ప్రభాస్ కూడా గుడ్ న్యూస్ చెప్పాలని కోరుకుంటున్నారు.
ప్రభాస్ నాలుగు పదుల వయసులో ఇంకా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకుగా టాలీవుడ్ లో కనిపిస్తున్నాడు. ఆయన అభిమానులు ప్రభాస్ ఓ ఇంటివాడు ఎప్పుడు అవుతాడా అని ఎదురు చూడని క్షణం లేదు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి కూడా పలు దేవాలయాల్లో ప్రభాస్ పెళ్లి కోసం ప్రత్యేకంగా పూజలు అవి చేయిస్తున్నారు.
ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి, ఆ ఏడాది ప్రభాస్ పెళ్లి అనడమే కానీ ప్రభాస్ మాత్రం ఆ గుడ్ న్యూస్ చెప్పకుండా అభిమానులకు ఆనందాన్ని దూరం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్నారు. రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్2 అంటూ ప్రభాస్ వచ్చే ఐదారేళ్ళు బిజినే.