అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శివ శంకర వరప్రసాద్ గారు చిత్ర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. చిరు బర్త్ డే టీజర్ లో ఆయన లుక్, కేరెక్టర్ అన్ని మెగా ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చెయ్యగా ఉగాదికి వదిలిన ఫెస్టివ్ లుక్ చూసి ఈ చిత్రం గట్టిగానే కొడుతోంది అని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక చిరు ఫ్రెండ్, అనిల్ రావిపూడి హీరో వెంకటేష్ మన శివ శంకర వరప్రసాద్ గారు చిత్రంలో క్యామియో చేస్తున్న విషయం అనిల్ రావిపూడి ఎప్పుడో రివీల్ చేసారు. అయితే చిరు-వెంకీ కాంబో సీన్స్ ను అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారట.
వెంకటేష్ కేరెక్టర్ మన శివ శంకర వరప్రసాద్ గారు లో కీలకంగా ఉంటుంది అని, చిరంజీవి యాక్షన్ సీక్వెన్స్ లో కూడా వెంకీ కనిపిస్తారని అంటున్నారు. వెంకీ మన శివ శంకర వరప్రసాద్ గారు సెట్ లోకి సెప్టెంబర్ లో అడుగుపెడతారని, ఆయనది క్యామియో గా కాకుండా కాస్త నిడివి ఉన్న పాత్రతోనే వెంకీ కేరెక్టర్ ని అనిల్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది.
ఈ చిత్రాన్ని జనవరిలో సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ చెయ్యడానికి అనిల్ రావిపూడి పక్కా ప్లానింగ్ తో మన శివ శంకర వరప్రసాద్ గారు షూటింగ్ చక్కబెట్టేస్తున్నారు.