అల్లు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అల్లూరి రామలింగయ్యగారి సతీమణి, అల్లు అరవింద్ గారి తల్లి, అల్లు అర్జున్ నాన్నమ్మ అల్లు కనకరత్నమ్మ పరమపదించారు. వృద్ధాప్యం కారణంగా ఆమె అర్ధరాత్రి దాటాక అంటే 1.45 am కి ఆవిడ కన్ను మూసినట్లుగా తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత కోకాపేట లో కనకరత్నమ్మ అంత్యక్రియలు నిర్వహించనునంట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.
అల్లు అర్జున్ AA 22 షూటింగ్ కోసం ముంబై లో ఉండగా.. ఆయన ఈరోజు ఉదయం 9 గంటలకు ముంబై నుంచి హైదరాబాద్ కి రానున్నారు. రాంచరణ్ పెద్ది షూటింగ్ లో మైసూర్ లో ఉన్నారు. మైసూర్ నుంచి రామ్ చరణ్ మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకొంటారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరు అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు.
పవన్ నాగబాబులు వైజాగ్ లో జరగనున్న పబ్లిక్ మీటింగ్ లో ఉన్నందున రేపు వచ్చి అల్లు కుటుంబాన్ని కలిసి సంతాపం తెలుపుతారు అని సమాచారం.