అనుష్క తాజా చిత్రం ఘాటీ సెప్టెంబర్ 5 న విడుదలకు సిద్దమవుతుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క యాక్షన్ హైలెట్ కానుంది. ఘాటీ ప్రమోషన్స్ కు రాను అంటూ అనుష్క ముందే నిర్మాతలతో అగ్రిమెంట్ రాసుకోవడంతో ఆమె మీడియా ముందుకు రాకుండా, ఘాటీ ని ప్రమోట్ చెయ్యకుండా సైలెంట్ గా ఉంది.
ఘాటీ సెన్సార్ కంప్లీట్ అయ్యింది. ఘాటీ చిత్రానికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఘాటీకి 2.37 నిమిషాలు క్రిస్పీ రన్ టైమ్ గా నిర్ణయించారు. అనుష్క యాక్షన్ ఘాటీ లో హైలెట్ కానుంది అని, ఏడెనిమిది పెద్ద యాక్షన్ సీన్లు సినిమా కి అదనపు ఆకర్షణ కానున్నాయని, అనుష్క ఘాటీ లుక్, క్రిష్ మేకింగ్ ఘాటీ కి హైలెట్ గా సెన్సార్ టాక్ వినిపిస్తుంది.
సెప్టెంబర్ 5 న పెద్దగా పోటీ కూడా లేకపోవడం ఘాటీ కి కలిసిరానుంది. కేవలం తమిళ హీరో శివకార్తికేయన్ మదరాసి చిత్రం తెలుగులో అదే ఐదో తారీఖున డబ్బింగ్ చిత్రంగా ఘటికి పోటీ ఇవ్వనుంది.