Advertisementt

హిట్ కోసం సుందరి వెయిటింగ్

Wed 27th Aug 2025 06:17 PM
janhvi kapoor  హిట్ కోసం సుందరి వెయిటింగ్
Sundari waiting for a Bollywood hit హిట్ కోసం సుందరి వెయిటింగ్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో ఎలాగైనా హిట్ కొట్టాలని ఎదురు చూస్తుంది సుందరి జాన్వీ కపూర్. ఆమె హిందీలో కెరీర్ మొదలు పెట్టినప్పటికి.. అక్కడ వరస సినిమాలు చేస్తున్నప్పటికి ఇప్పటివరకు జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో హిట్ అనేది దక్కలేదు. హిందీలో ప్రూవ్ చేసుకున్నాకే ఆమె సౌత్ లో అడుగుపెట్టాలనుకుంది కానీ హిందీ లో సక్సెస్ దొరక్క సౌత్ కి ముందే వచ్చేసింది. 

దేవర తో ఓకె అనిపించింది. ఆ వెంటనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ది ఆఫర్ పట్టేసింది. సౌత్ లో ఎంత పెద్ద స్టార్స్ తో సినిమాలు చేస్తున్నప్పటికీ జాన్వీ కపూర్ హిందీలో హిట్ కొట్టాలని ఎదురు చూస్తుంది. ప్రస్తుతం సిద్దార్థ్ మల్హోత్రాతో పరం సుందరి చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. 

పరం సుందరి గా జాన్వీ కపూర్ ఆ చిత్రంలో కేరళ కుట్టిగా ట్రెడిషనల్ గానే కనిపిస్తుంది కానీ.. పాటల్లో గ్లామర్ గా అందాలు చూపిస్తూ రెచ్చిపోతుంది. అంతేకాదు పరం సుందరి ప్రమోషన్స్ లోను జాన్వీ కపూర్ గ్లామర్ షో చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఈ చిత్రంతో హిందీలో హిట్ కొట్టాలని జాన్వీ కపూర్ గట్టిగానే ట్రై చేస్తుంది.  

Sundari waiting for a Bollywood hit:

Janhvi Kapoor Bets Everything On Param Sundari Success

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ