నారా రోహిత్ ఎప్పుడు విలక్షణమైన కథలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తాడు. అసలు సక్సెస్ ని, ప్లాప్ ని పట్టించుకోని హీరో నారా రోహిత్. స్నేహితుల కోసం ప్రాణం పెట్టే నారా రోహిత్ రీసెంట్ గానే భైరవం చిత్రం తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇప్పుడు సుందరకాండ అంటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వినాయకచవితి పండుగనాడు ప్రేక్షకులను పలుకరించాడు.
మాస్ జాతరలో పోటీ పడుతున్న నారా రోహిత్ కి సుందరకాండ కంటెంట్ పై అంత నమ్మకమా అనుకుంటే.. మాస్ జాతర రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యి సుందరకాండ సోలో గా థియేటర్స్ లోకి దిగింది. నారా రోహిత్ తన టీమ్ తో కలిసి సినిమాని బాగా ప్రమోట్ చేసారు. ఇక నేడు థియేటర్స్ లో విడుదలైన సుందరకాండ కు ప్రేక్షకుల నుంచే కాదు క్రిటిక్స్ నుంచి కూడా హిట్ టాక్ వినిపిస్తోంది.
రివ్యూస్ కూడా పాజిటివ్ గా ఉండడంతో నారా రోహిత్ హమ్మయ్య కొట్టేసాం అంటూ రిలాక్స్ అవుతున్న పోస్టర్ ని సుందరకాండ నుంచి వదిలారు. మరి సింపుల్ గా కనిపించిన సుందరకాండ ఇప్పుడు థియేటర్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సుందరకాండ మేకర్స్ ఎగ్జైట్ అవుతూ ఇలాంటి పోస్టర్ ని వదిలారన్నమాట.