బిగ్ బాస్ సీజన్ 9 పై ఆసక్తి కలిగేలా అగ్నిపరీక్ష అంటూ కామన్ మ్యాన్ ఎంట్రీ కోసం షో పెట్టారు. ఇక బిగ్ బాస్ సీజన్ 9 లోకి వెళ్లబోయే వాళ్ళ పేర్లు చాలానే వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఆడియన్స్ మూడ్ ను అగ్నిపరీక్ష డైవర్ట్ చేస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండే టాస్క్ ల కన్నా ఎక్కువగా అగ్నిపరీక్ష లో టాస్క్ లే కనిపిస్తున్నాయి.
అయితే సీజన్ 9 ని బుల్లితెర ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా యాజమాన్యం బిగ్ స్కెచ్ వేస్తుంది. అందులో భాగంగా క్రేజీ క్రేజీ కంటెస్టెంట్స్ ను తీసుకొస్తుంది. పారితోషికాలు ఎంతైనా సరే ఈసారి కాంట్రవర్సీ కి కేరాఫ్ గా నిలిచిన వాళ్ళను హౌస్ లోకి పంపించబోతుంది అనే వార్త వైరల్ గా మారింది.
తన శిష్యురాలు అసిస్టెంట్ శ్రేష్టి వర్మను మనోవేదనకు గురి చేసిన ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ పై కేసు పెట్టి ఫేమస్ అయిన శ్రేష్టి వర్మ ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి వెళ్ళబోతుంది వార్త వైరల్ అవుతోంది. అంతేకాకుండా జానీ మాస్టర్ పై కేసు పెట్టి రచ్చ చేసి వీధి కీడ్చిన శ్రేష్టి వర్మ ఈసారి హౌస్ లోకి వెళ్లబోతుంది అనే వార్త మాత్రం వైరల్ గా మారింది
మరి కొన్ని నెలలు పాటు జైలులో ఉన్న జానీ మాస్టర్ ని జైల్లో పెట్టించిన శ్రేష్టి వర్మ బిగ్ బాస్ హౌస్ లో ఉంటె మిగతా కంటెస్టెంట్స్ బాండింగ్ ఎలా ఉంటుంది, విభేదాలుంటే ఎలా ఉంటారు.. హౌస్లో అందరితో ఆమె ఎలా కలిసి మెలిసి కనిపిస్తుంది, లేదంటే కొట్టుకుంటారా అనేది ఇప్పుడు క్రేజీగా మారింది.