మెగా ఫ్యామిలోకి నాగబాబు కోడలిగా, మెగా చిన్న కోడలిగా, వరుణ్ తేజ్ భార్య గా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత అత్తమామలు, ఆడపడుచు నిహారికతో కలిసి ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో లావణ్య త్రిపాఠి బాగానే ఇమిడిపోయింది. పెళ్లి తర్వాత కూడా ఆమె నటనకు బ్రేక్ ఇవ్వలేదు.
లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి విడుదలకు సిద్దమవుతుంది. కొద్దినెలల క్రితమే లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ జంట తల్లితండ్రులుగా ప్రమోట్ కాబోతున్నామనే శుభవార్తను ప్రకటించారు. ఆతర్వాత లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ కలిసి వెకేషన్ కు వెళ్లగా లావణ్య త్రిపాఠి బేబీ బంప్ ఎయిర్ పోర్ట్ లో కొద్దిగా కనిపించింది.
కానీ ఈ వినాయక చవితి సందర్భంగా లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ లు కలిసి వినాయక చవితి సెలెబ్రేట్ చేసుకున్న పిక్ షేర్ చేసారు. అందులో లావణ్య స్టూల్ పై కూర్చుని ఉండగా ఆమె బేబీ బంప్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసాక మెగా చిన్నకోడలు లావణ్య ఎప్పుడెప్పుడు వరుణ్ కి వారసుణ్ణి ఇస్తుందా అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.