ఈటివి జబర్దస్త్ కామెడీ షోలో ఫేమస్ అయ్యి కొంతమంది వెండితెరపై కమెడియన్స్ గా, మరికొంతమంది హీరో లుగా, రైటర్స్ గాను, దర్శకులుగా మారి లైఫ్ సెటిల్ అయినవారే కాదు జబర్దస్త్ మొదలైనప్పటినుంచి స్టిల్ ఇప్పటివరకు అదే షోలో కంటిన్యూ అవుతున్న వారు ఉన్నారు. కొంతమంది జబర్దస్త్ వదిలేసారు. రీసెంట్ గానే జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 12 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్పెషల్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు.
ఈ 12 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో జబర్దస్త్ లో ఫేమస్ అయ్యి షో ని వదిలేసినవారంతా పాల్గొన్నారు. ఆఖరికి జెడ్జి నాగబాబు కూడా వచ్చారు. అయితే ఆ సెలెబ్రేషన్స్ లో ఒకరిద్దరు ముఖ్యంగా జబర్దస్త్ నుంచి పాపులర్ అయ్యి హీరోగా మారి ఆతర్వాత పలు షోస్ కి యాంకరింగ్ చేస్తున్న సుధీర్, అలాగే జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు నుంచి ఎన్నో ఏళ్ళు జెడ్జి గా ఉన్న రోజా మిస్ అయ్యింది.
తాజాగా వినాయక చవితి సెలెబ్రేషన్స్ కి సుధీర్ యాంకరింగ్ లో ఫెస్టివల్ ప్రోగ్రాం ని ఈటివి వారు ప్లాన్ చేశారు. అందులో ఆది సుధీర్ పై ఇండైరెక్ట్ పంచ్ లు వెయ్యడం నిజంగా వైరల్ అవుతుంది. సుధీర్ వినాయకచవితి స్పెషల్ ప్రోగ్రాంలో ఆదిని మీకు కమిట్మెంట్ ఉండాలి సర్ అనగానే హైపర్ ఆది అవును కమిట్మెంట్ గురించి మీరే చెప్పాలి.
జబర్దస్త్ 12 ఇయర్స్ సెలెబ్రేషన్స్ కి రమ్మంటే పక్కనే ఉన్న అన్నపూర్ణలో ఉండి అండమాన్ లో ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చిన మీరే మాట్లాడాలి అనగానే అక్కడే ఆ ప్రోగ్రామ్ లో ఉన్నఅందరూ పగలబడి నవ్వేశారు కానీ.. ఆది మాత్రం ఇండైరెక్ట్ గా ఈ షో లో సుధీర్ కి తిరిగే షాకిచ్చినట్టే కనిపిస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.