కన్నడ లో చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సు ఫ్రమ్ సో చిత్రం థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కన్నడ లో హిట్ అయిన ఈ చిన్న చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేసింది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ. ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేకుండా కన్నడ ఆడియన్స్ ను మెప్పించిన సు ఫ్రమ్ సో తెలుగు ప్రేక్షకులను అంతగా ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది.
ఇక థియేట్రికల్ రన్ ముగియడంతో సు ఫ్రమ్ సో ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. సు ఫ్రమ్ సో ఓటీటీ హక్కులను జియో ప్లస్ హాట్ స్టార్ బెస్ట్ డీల్ తో చేజిక్కించుకుంది. ఇప్పుడు సు ఫ్రమ్ సో ని ఓటీటీ లోకి తెచ్చేందుకు రెడీ అయ్యారు మేకర్స్.
జియో ప్లస్ హాట్ స్టార్ నుంచి సు ఫ్రమ్ సో ని సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. థియేటర్స్ లో హిట్ అయిన ఈ చిన్న చిత్రాన్ని అక్కడ మిస్ అయిన వారు ఓటీటీలో చూసేందుకు రెడీ అయిపోండి.