అవును అనుష్క ది పాత కథే. అంటే.. ఆమె మళ్ళీ సినిమా ప్రమోషన్స్ లో కనిపించదు. బాహుబలి తర్వాత సైజు జీరో తో బాగా బరువు పెరిగిన అనుష్క శెట్టి ఆతర్వాత మీడియాకి కనిపించిందే లేదు. ఆమె నటించిన నిశ్శబ్దం, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి చిత్రాల ప్రమోషన్స్ కోసం ఆమె మీడియా ముందుకు రాలేదు. కేవలం మేకర్స్ ప్రమోట్ చేసుకున్నారు.
ఇప్పుడు ఆమె నటించిన ఘాటీ కూడా సెప్టెంబర్ 5 న విడుదల కాబోతుంది. మరోపక్క బాహుబలి ద ఎపిక్ రీ-రిలీజ్ కి రెడీ అవుతున్న సమయంలో అనుష్క మీడియా ముందుకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ తాజాగా అనుష్క పాత పాటే పాడుతుంది, ఆమె ఘాటీ ప్రమోషన్స్ కి రాదని నిర్మాతల్లో ఒకరైన రాజీవ్ రెడ్డి స్పష్టం చేశారు.
అనుష్క సినిమా ఒపుకున్నప్పుడే ప్రమోషన్స్ కి రాదనే కండిషన్స్ ఉన్నాయట. సో ఘాటి ప్రమోషన్స్ లో అనుష్క కనిపించదు, మరి అప్పట్లో మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి అప్పుడు నవీన్ పోలిశెట్టి ప్రమోషన్స్ భారాన్ని మోసినట్టుగా ఇప్పుడు దర్శకుడు క్రిష్ కూడా ఘాటీ ప్రమోషన్ ని భుజానకెత్తుకుంటున్నారు. ఇప్పటికే ఆయన బుల్లితెర షోస్ లో ఘాటీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
సో అనుష్క సినిమాలో మాత్రమే నటిస్తుంది, ఇకపై ఆమె మీడియా ముందుకు రాదు అనేది అందరూ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదేమో.