త్వరలో మొదలు కాబోయే బిగ్ బాస్ సీజన్ 9 కోసం కామన్ మ్యాన్ ను హౌస్ లోకి పంపించేందుకు అగ్నిపరీక్ష ద్వారా కంటెస్టెంట్స్ ను ఎంపిక చేస్తున్నారు. ఈ అగ్నిపరీక్ష ప్రస్తుతం జియో ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది. ఈ షో కి బిగ్ బాస్ విన్నర్స్ అయిన అభిజిత్ తో పాటుగా బిందు మాధవి అలాగే సీజన్ 1 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి రన్నర్ గా నిలిచిన నవదీప్ లు జెడ్జిలుగా ఈ షో నడుస్తుంది.
అగ్నిపరీక్షకు గత సీజన్ విన్నర్స్ అభిజిత్, బిందు మాధవిలను ఎంపిక చేసిన యాజమాన్యం మరో విన్నర్ ని కాకుండా రన్నర్ నవదీప్ ను ఎంపిక చెయ్యడం పై సీజన్ 2 విన్నర్ కౌశల్ ఫైర్ అవుతున్నాడు. బిగ్ బాస్ విన్నరయిన తనని కాదని నవదీప్ ని ఎలా తీసుకుంటారంటూ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
సీజన్ 2 లో కౌశల్ ఆర్మీ కౌశల్ ని విన్నర్ ని చెయ్యడమే కాదు హోస్ట్ నాని ని టార్గెట్ చెయ్యడము, విన్నర్ గా బయటికొచ్చాక కౌశల్ చేసిన హడావిడీ అంతా ఇంతా కాదు. కౌశల్ అతిని టీవీ 5 మూర్తి బయటపెట్టాడు. విన్నర్ అయ్యాక అవకాశాలు వస్తాయని రెచ్చిపోయిన కౌశల్ ఇప్పుడు అసలు సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నాడు. అగ్నిపరీక్ష కోసం హౌస్ లో చేసిన అతిని ఇక్కడ కూడా ప్రదర్శిస్తున్న కౌశల్ ని చాలామంది నీకంత సీన్ లేదు బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.