సమంత ప్రస్తుతానికి సినిమాలకు బ్రేకిచ్చినా ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. దానికి కారణం ఆమె స్టైలింగ్ అలాగే ఆమె రెండో పెళ్లి రూమర్స్ తో ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. అందుకే నటనకు బ్రేకిచ్చినా ఆమె క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు.
రాజ్ నిడమోరు తో సమంత డేటింగ్ లో ఉంది అనే వార్తలు ఆమెకు ఇంకాస్త క్రేజ్ పెరిగేలా చేసింది. ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్న సమంత తన బ్యానర్ నుంచి రాబోయే మరో సినిమా ని నిర్మించే ప్లాన్ లో ఉంది. ఈ సినిమాని లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి చేతికి ఇచ్చినట్టుగా టాక్.
ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా గ్లామర్ ఫొటోస్ ను షేర్ చేసే సమంత తాజాగా జిబ్రా డ్రెస్ లో రాయల్ ఫోజులతో అద్దరగొట్టేసింది. మాయోసైటిస్ వ్యాధి బారిన పడి సన్నబడినప్పటికీ సమంత మాత్రం గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటుంది. ప్రస్తుతం సమంత లేటెస్ట్ లుక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.