Advertisementt

లేడీ సూప‌ర్ స్టార్ తో చిరు కు ప్రాబ్ల‌మ్!

Tue 26th Aug 2025 09:38 AM
chiranjeevi  లేడీ సూప‌ర్ స్టార్ తో చిరు కు ప్రాబ్ల‌మ్!
Nayanthara will be playing the female lead opposite Chiranjeevi లేడీ సూప‌ర్ స్టార్ తో చిరు కు ప్రాబ్ల‌మ్!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో చిరంజీవికి జోడీగా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టిస్తోంది. ఈ సినిమా కోసం అమ్మ‌డు తానెం తో ఇష్ట‌ప‌డి సైన్ చేసింది. చిరంజీవితో మ‌రోసారి వెండి తెర‌పై క‌నిపించాల‌నే ఆశ‌తో ముందుకొ చ్చింది. అందుకు త‌గ్గ‌ట్టే సినిమా ప్రీ లాంచ్ ప్ర‌చారంలోనూ జోరుగా పాల్గొంది. ప్ర‌చార‌మంటే ఆమ‌డ దూరంలో ఉండే న‌య‌న్ ఇలా అన్న‌య్య సినిమా కోసం త‌న‌కు తానుగా ముందుకొచ్చి ప్ర‌చారం చేయ‌డంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మైంది.

బాస్ సినిమా కావ‌డంతో న‌య‌న్ ఇలా రూల్స్ అన్నింటిని పక్క‌న బెట్టింద‌ని...తాను కూడా సొంతంగా నిర్మా ణ సంస్థ ను న‌డ‌ప‌డంతో ప్ర‌చారం విలువేంటో తెలుసుకుని ముందుకొచ్చిందిగా అంతా భావించారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ ఇక్క‌డే ఓ బ్యాడ్ సెంటిమెంట్ కూడా వెంటాడుతుంది. చిరంజీవి సినిమాకు న‌య‌నతార ప్ల‌స్ అవుతుందా?  మైన‌స్ అవుతుందా? అంటూ  కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. దీనిలో భాగంగా చిరుతో న‌య‌న్ గ‌తంలో న‌టించిన సినిమాల జాబితా?..వాటి ఫ‌లితాలు త‌వ్వి తీస్తున్నారు.

అవి చూస్తే  అభిమానుల‌కు ఆందోళ‌న త‌ప్ప‌దు. తొలిసారి చిరంజీవి-న‌య‌న‌తార క‌లిసి `సైరా న‌ర‌సిం హారెడ్డి`లో న‌టించారు. అందులో న‌య‌న్ చిరు భార్య పాత్ర పోషించారు. చిరంజీవి తొలి పాన్ ఇండియా సినిమా కూడా అదే. భారీ అంచ‌నాల  మ‌ధ్య భార‌తీయ భాష‌ల‌న్నింటిలోనూ రిలీజ్ అయింది. కానీ బాక్సా ఫీస్ వ‌ద్ద ఫ‌లితం నిరాశ‌నే మిగిల్చింది. ఆ సినిమా అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌లమైంది.  అటుపై  చిరంజీవి న‌టించిన మ‌రో చిత్రం `గాడ్ ఫాద‌ర్` లోనూ భాగ‌మైంది.

ఇందులో న‌య‌న్ చిరు సోద‌రి పాత్ర పోషించింది.  ఈ సినిమా కూడా అంచ‌నాలు అందుకోలేక‌పోయింది. అలా చిరుతో న‌య‌న్ న‌టించిన రెండు సినిమాలు అన్నయ్య అభిమానుల్లో అసంతృప్తినే నింపాయి. మ‌ళ్లీ చిరంజీవి న‌య‌న్ జ‌త క‌ట్ట‌డంతో అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? ఆ సెంటిమెంట్ ని తిర‌గ రా స్తుందా? అంటూ నెట్టింట చ‌ర్చ సాగుతోంది. మ‌రి న‌య‌న్ క‌ల‌యిక ఈసారి ఎలాంటి ఫ‌లితాలిస్తుందో  చూడాలి.

Nayanthara will be playing the female lead opposite Chiranjeevi:

Chiranjeevi And Nayanthara Next Titled Mana Shankara Vara Prasad Garu

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ