అక్కినేని వారసుడు అఖిల్ కథనాయకుడిగా మురిళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో `లెనిన్` తెరకె క్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న పీరియాడిక్ చిత్రమిది. ఈ సినిమా కోసం అఖిల్ రాయలసీమ మాండలికం పై ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. పాత్రతో పాటు, పర్పెక్ట్ డబ్బింగ్ కావాలంటే? ఆ మాత్రం ట్రైనింగ్ అవసరంగా భావించి అదనంగా కష్టపడ్డాడు. ఈ సినిమాతోనైనా భారీ హిట్ అందుకోవాలని ఎదురు చూస్తున్నాడు.
ఇప్పటి వరకూ సినిమాపై అంతా పాజిటివ్ గానే ఉంది. రిలీజ్ అయిన గ్లింప్స్ పాజిటివ్ వైబ్ ని తీసు కొచ్చా యి. గ్లామర్ పాత్ర పరంగా భాగ్య శ్రీ బోర్సే కవర్ చేస్తుంది. అఖిల్...డైరెక్టర్ కు కంపర్ట్ బుల్ గా భాగ్య శ్రీ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో అదిరిపోయే మసాలా ఐటం సాంగ్ ఒకటుందిట. ఆ పాటను మంగ్లీ ఆలపిస్తుందని సమాచారం. అయితే ఆ పాటలో ఐటం గాళ్ ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. పేరున్న భామనే ఐటం భామగా పరిశీలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తొలి ప్రపోజల్ శ్రీలీల దగ్గరకు వెళ్లినట్లు తెలిసింది. మేకర్స్ అమెని అప్రోచ్ అయ్యారుట. పాటలో నటించాల్సిందిగా కోరారుట. అడిగినంత పారితోషికం చెల్లిస్తామని హమీ ఇచ్చారుట. అందుకు శ్రీలీల ఆలోచించి చెబుతానని చెప్పిందిట. మరి కిసిక్ బ్యూటీ ఒప్పుకుంటుందా? లేదా? అన్నది ఆమె చేతుల్లో పని. తొలుత `లెనిన్` లో హీరోయిన్ గా శ్రీలీలనే తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ హిందీ సినిమా తో డేట్లు క్లాష్ అవ్వడంతో అనూహ్యంగా ప్రాజెక్ట్ నుంచి వైదొలిగింది. ఈ నేపథ్యంలో శ్రీలీల చాలా నెగిటి విటీనే ఎదుర్కుంది.
బంగారం లాంటి అవకాశాన్ని వదులకుని హిందీ పరిశ్రమకు వెళ్తుందని విమర్శల పాలైంది. మరి ఇప్పుడా విమర్శలు పీక్స్ కు చేరకూడదంటే? ఐంట ఆఫర్ ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి అంగిక రించి విమర్శలకు అక్కడితో చెక్ పెడుతుందా? వాటిని పీక్స్ కు తీసుకెళ్తుందా? అన్నది శ్రీలీల చేతు ల్లోనే ఉంది.