నిజమే ప్రభాస్ ఒకప్పుడు చాలా స్లొ గా సినిమాలు చేసేవారు. కానీ కొన్నాళ్ళుగా వరసగా సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఆయన నటిస్తున్న సినిమాలు రెండు మూడు సెట్ పై ఉండేలా చూసుకుంటున్నారు. రాజా సాబ్, ఫౌజీ చిత్రాలు సెట్ పై ఉంటే.. సందీప్ వంగ తో స్పిరిట్ అనౌన్స్ చేసారు. కల్కి 2, సలార్ 2, ఇలా పలు సినిమాలు లైన్ లో ఉన్నాయి.
కానీ ఇప్పుడు ప్రభాస్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు దర్శకనిర్మాతలు. గత 18 రోజులు కార్మికుల సమ్మె తో రాజా సాబ్, ఫౌజీ షూటింగ్స్ వాయిదా పడ్డాయి. ఇప్పుడు షూటింగ్ లు మొదలు అవడంతో అటు రాజా సాబ్, ఇటు ఫౌజీ రెండు చిత్రాలను పూర్తి చెయ్యాల్సిన అగత్యం ఏర్పడింది. రాజా సాబ్ ఓ 20 రోజుల షూటింగ్ చేస్తే ఫినిష్ అవుతోంది.
ఫౌజీ సగం షూటింగ్ పూర్తయ్యింది. ఇక సందీప్ వంగ స్పిరిట్ సెప్టెంబర్ చివరి నుంచి అంటున్నారు. ఒక్కసారి స్పిరిట్ లోకి అడుగుపెడితే ప్రభాస్ మారో సినిమా చెయ్యడానికి లేదు. ఈలోపే రాజా సాబ్, ఫౌజీ లను ఓ కొలిక్కి తేవాలి. ఈలోపు కార్మికుల సమ్మె. ఇప్పడు అంతా సర్దుకోవడంతో ప్రభాస్ ఆ రెండు సినిమాల షూటింగ్స్ తో ఉక్కురిబిక్కిరి అవుతున్నారు.
ఇలా ఏ హీరోకి లేదు హడావిడి. ప్రతి ఒక్క హీరో ఒక్కో సినిమాతోనే సెట్ పై ఉన్నారు. కేవలం ప్రభాస్ మాత్రమే అరడజను సినిమాలతో హడావిడి పడుతున్నారు.