యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీలోకి నేరుగా అడుగుపెట్టిన ప్రాజెక్ట్ వార్ 2. ఈ చిత్రంతో ఎన్టీఆర్ బాలీవుడ్ ముద్ర వేస్తాడని ఆయన అభిమానులే కాదు చాలామంది భావించారు. కానీ వార్ 2కి అనుకున్న స్పందన రాకపోవడం నిజంగా ఎన్టీఆర్ బ్యాడ్ లక్. హృతిక్ రోషన్ ను వదిలేసి అందరూ ఎన్టీఆర్ నే టార్గెట్ చేస్తూ ట్రోల్ చెయ్యడం అభిమానులకు మరింత బాధ కలిగించింది.
అయితే వార్ 2 కి అంత నెగెటివ్ టాక్ ఏమి రాలేదు. కానీ వార్ 2 ప్లాప్ అయ్యింది. వార్ 2 అంత బ్యాడ్ గా ఏమి లేదు.. కానీ కలెక్షన్స్ రాలేదు. కారణం ఒక్కటే. కూలి తో వార్ 2 పోటీపడడమే. కూలి సినిమా వలనే వార్ 2 కలెక్షన్స్ తగ్గడానికి ప్రధాన కారణం. వార్ 2కి అంత డ్యామేజ్ జరగడానికి మెయిన్ రీజన్ కూలి.
కూలి చిత్రం వలనే వార్ 2 అంతగా ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళింది. కూలి తో పోటీ గనక లేకపోతే వార్ 2 ఖచ్చితంగా 500 కోట్ల మార్కెట్ ను దాటేసేది. కానీ కూలి తో పోటీ పడి వార్ 2 చేతులు కాల్చుకుంది. కూలి గనక పోటీకి రాకపోతే వార్ 2 రిజల్ట్ మరోలా ఉండేది. ప్రేక్షకులకు వార్ 2 తప్ప మరో ఆప్షన్ ఉండేది కాదు, లాంగ్ వీకెండ్ లో వార్ 2 ని చూజ్ చేసుకునేవారు.
టాక్ తో సంబంధం లేకుండా పెద్ద హీరోల సినిమాలు చూసేవారు. కానీ కూలి అది జరగనివ్వలేదు. సో వార్ 2కి అంతగా డ్యామేజ్ అవ్వడం ఖచ్చితంగా కూలీనే కారణం.