Advertisementt

జగన్ ది ముమ్మాటికీ తప్పే..

Mon 25th Aug 2025 12:11 PM
jagan  జగన్ ది ముమ్మాటికీ తప్పే..
Jagan is completely wrong says Blue media జగన్ ది ముమ్మాటికీ తప్పే..
Advertisement
Ads by CJ

జగన్ ది ముమ్మాటికీ తప్పే అంటూ అక్షరాలా బ్లూ మీడియానే నొక్కి వక్కాణిస్తుంది. 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన జగన్ మోహన్ రెడ్డిని ఆఖరికి బ్లూ మీడియా కూడా విమర్శిస్తోంది అంటే జగన్ తప్పిదాలు ఎలా ఉన్నాయో స్పష్టమవుతుంది. ప్రజలే కాదు బ్లూ మీడియా సైతం జగన్ తప్పులను ఎత్తి చూపడం జగన్ వర్గానికి, వైసీపీ నేతలకు కనిపించడం లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇంతకీ బ్లూ మీడియా జగన్ ను ఎందుకు విమర్శించింది అంటే.. వైసీపీ అధికారంలోకి రాకముందు అమరావతి ని రాజధానిగా ఒప్పుకోకుండా, ఒప్పుక్కున్నట్లుగా 2019 ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టింది. అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం అమరావతిపై విషం చిమ్ముతూ అధికారం కేద్రీకృతం అంటూ మూడు రాజధానుల నినాదానికి తెరలేపింది. అమరావతిని రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు అంతో ఇంతో నిర్మాణాలు చేపట్టారు కానీ జగన్ అమరావతిని గాలికి వదిలేసాడు. 

అప్పటికి ఇప్పటికి అమరావతి వర్షాలు, వరదలు వస్తే మునిగిపోతుంది అంటూ నింద వెయ్యడం తప్పితే అమరావతిపై ప్రేమ చూపించడం లేదు జగన్, అధికారంలో ఉన్నప్పుడు, పోయాక కూడా అమరావతి ముంపు ప్రాంతమని ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ లాంటి మహా మహా రాజధానులు వర్షాలు, వరదలతో ఒణికిపోతుంటే.. అదేదో అమరావతి మాత్రమే మునిగిపోతున్నట్టుగా వైసీపీ బిల్డప్ రాజకీయాలు చెయ్యడమెందుకో అర్ధం కావడం లేదు, అదే జగన్ కూడా చేస్తున్నారంటూ బ్లూ మీడియా జగన్ తీరుని తప్పుబడుతుంది. 

పోనీ జగన్ ఏమైనా మూడు రాజధానులను బాగు చేసారా, అసలు ఆ రాజధానుల్లో అధికారం చేపట్టారా అంటే అదీ లేదు, కానీ ఓడిపోయాక కూడా బుద్ధిలేకుండా అమరావతి ముంపు అంటూ మాట్లాడడం హాస్యాస్పదం, ఆయన అనుకూల మీడియా సాక్షి లోను అదే ప్రచారం.  జగన్ కి తెలియదు, ఆయనకు సలహాలు ఇచ్చే వాళ్ళకైనా బుద్దుండాలిగా అంటూ వైసీపీ మీడియా జగన్ ను, వైసీపీ నేతలను కడిగి ఆరేస్తుంది.  

Jagan is completely wrong says Blue media:

YCP Fake News On Amaravathi

Tags:   JAGAN
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ