అఖిల్ అక్కినేని హీరోగా మురళి అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూరల్ లవ్ స్టోరీ లెనిన్. అఖిల్ బర్త్ డే స్పెషల్ గా లెనిన్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ వదలగా.. అక్కినేని అభిమానులను ఇంప్రెస్స్ చేసింది. ఈ చిత్రంలో ఫస్ట్ టైమ్ శ్రీలీల అఖిల్ సరసన జోడి కడుతుంది. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో లెనిన్ షూటింగ్ చిత్రకరణ జరుగుతుంది.
అయితే లెనిన్ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది అనే టాక్ మొదటినుంచి వినబడుతూనే ఉంది. ఈ పాట లో అఖిల్ తో మాస్ స్టెప్స్ వేసేందుకు చాలామంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి ఈపాట కోసం ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకురావాలని చూస్తున్నారట.
మాములుగానే మంచి సాంగ్ పడితే హీరోయిన్ శ్రీలీల డాన్స్ స్టెప్స్ మ్యాచ్ చెయ్యాలంటే హీరోయిన్ లకే కంగారు పుడుతుంది. అదే లెనిన్ లో ఆమె హీరోయిన్, ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే హీరోయిన్ శ్రీలీల తో డాన్స్ స్టెప్స్ మ్యాచ్ చేసేదిగా ఉండాలి, అందుకే మురళీ కిషోర్ అబ్బూరి స్టార్ హీరోయిన్ కోసం వెతుకులాటలో ఉన్నారని చెబుతున్నారు. ఇక ఈ స్పెషల్ పాటను సింగర్ మంగ్లీ చేత పాడించనున్నారని టాక్.