దర్శకరత్న డా.దాసరి నారాయణరావు - అక్కినేని నాగేశ్వరరావు మధ్య స్నేహం, వృత్తిగతమైన సంబంధ బాంధవ్యాల గురించి తెలిసిందే. లెజెండరీ నటుడు ఏఎన్నార్ కి పలు బ్లాక్ బస్టర్లను అందించారు దాసరి. కానీ కాలక్రమంలో ఇద్దరి మధ్యా పొరపొచ్చాలొచ్చాయని మీడియాలో కథనాలొచ్చాయి.
దానికి కారణం ఏదైనా కానీ, ఓసారి ఏఎన్నార్ గురించి తప్పుడు విధానంలో తిడుతూ దాసరి మాట్లాడారని తాము విన్నట్టు ఏఎన్నార్ పెద్ద కుమారుడు, నిర్మాత అక్కినేని వెంకట్ ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు ఆ ఇద్దరి మధ్యా ఏమైందో మాకు తెలీదు. ఆయన అలా ఎందుకు అన్నారో వివరాలేవీ లేవు! అని కూడా వెంకట్ అన్నారు.
అయితే దాసరి మాత్రం తన తండ్రి గారిని తిట్టిన విషయం తమకు తెలుసునని అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో అన్నపూర్ణ ఏడెకరాలను అప్పటి ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకోవాలని భావించిన విషయాన్ని ప్రశ్నించగా, మధ్యలో ఎవరో పుల్లలు పెట్టడం వల్ల ఈ పరిస్థితులు వచ్చాయని, చివరికి తాము హైకోర్టు వరకు వెళ్లి పోరాడి కేసు గెలిచామని అక్కినేని వెంకట్ వెల్లడించారు. ఎన్టీఆర్ తో విభేధాలు లేవు కానీ, ఎవరో ఇద్దరి మధ్యా పుల్లలు పెట్టే శకుని బ్యాచ్ ఉన్నారని అంగీకరించారు వెంకట్. సినీపరిశ్రమలో ఇరువర్గాలలోను ఇలాంటి శకుని బ్యాచ్‌లు ఉంటాయని బాహాటంగా వ్యాఖ్యానించారు.