హరి హర వీరమల్లు పదే పదే వాయిదాలు పడుతూ పవన్ ఫ్యాన్స్ ని చిరాకు పెడుతూ చివరికి జులై 24 న ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ చిత్రంతో పవన్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. వీరమల్లు చిత్ర రిజల్ట్ మరిపించేలా OG మేకర్స్ OG అప్ డేట్స్ తో పవన్ ఫ్యాన్స్ లో హ్యాపీనెస్ నింపుతున్నారు.
పవన్ కళ్యాణ్ డేట్స్ కారణముగా OG కూడా పలుమార్లు వాయిదాపడి చివరికి సెప్టెంబర్ 25 కి దసరా స్పెషల్ గా ఫిక్స్ అయ్యింది. మధ్యలో అఖండ 2 కూడా అదే డేట్ కి వస్తుంది, OG మళ్లీ వాయిదా పడినా పడొచ్చనే టాక్ నడిచింది. దానితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దిగులుపడిపోయారు. కానీ ఇకపై పవన్ ఫ్యాన్స్ దిగులు పడక్కర్లేదు. కారణం OG ఎట్టిపరిస్థితుల్లో సెప్టెంబర్ 25 కి రావాల్సిందే. ఎందుకంటే మేకర్స్ అదే స్పీడులో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.
అంతేకాదు ఓవర్సీస్ లో అప్పుడే OG బుకింగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు OG నుంచి సెకండ్ సింగల్ రాబోతుంది. మరి ఇలాంటి ప్రమోషన్స్ షురూ చేసి, స్పీడు చూపిస్తుంటే.. ఇకపై OG వాయిదా పడేఅవకాశం కానీ, అవసరం కానీ కనిపించడమే లేదు. అందుకే అనేది పవన్ ఫ్యాన్స్ కి ఇకపై అసలు దిగులక్కర్లేదు అని.