Advertisementt

క‌న్న‌డ ద‌ర్శ‌కుల‌పై న‌టి సంచ‌ల‌న ఆరోప‌ణ‌

Mon 25th Aug 2025 10:38 AM
daisy shah  క‌న్న‌డ ద‌ర్శ‌కుల‌పై న‌టి సంచ‌ల‌న ఆరోప‌ణ‌
Kannada actress sensational comments on directors క‌న్న‌డ ద‌ర్శ‌కుల‌పై న‌టి సంచ‌ల‌న ఆరోప‌ణ‌
Advertisement
Ads by CJ

క‌న్న‌డ సినీరంగంలో తాను కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒక వివ‌క్ష‌ గురించి ఓపెనైంది న‌టి డైసీ షా. స‌ల్మాన్ ఖాన్ జైహో లో న‌టించిన ఈ బ్యూటీ క‌న్న‌డంలోను ప‌లు చిత్రాల్లో న‌టించింది. అయితే త‌న నాభి (బొడ్డు) పై పండ్లు, స‌లాడ్లు వేసేందుకు క‌న్న‌డ ద‌ర్శ‌కులు ఆస‌క్తిగా ఉండేవార‌ని, వారికి ఆరోజుల్లో అలాంటి పిచ్చి ఉంద‌ని వ్యాఖ్యానించింది డైసీ. త‌న‌కు ఆ స‌మ‌యంలో అసౌక‌ర్యంగా ఇబ్బందిగా అనిపించింద‌ని కూడా వెల్ల‌డించింది. క‌న్న‌డ సినీరంగంలో కొంద‌రు ద‌ర్శ‌కుల‌కు ఇలాంటి అల‌వాటు ఉంద‌ని ఆరోపించింది. మ‌గాళ్ల ఫాంట‌సీల కోసం స్త్రీ శ‌రీరాన్ని వ‌స్తువులా ఉప‌యోగించుకునేవార‌ని కూడా డైసీ షా అన్నారు.

అయితే 90ల‌లో ఈ త‌ర‌హా పాట‌ల మేకింగ్ చాలా రొటీన్ గా క‌నిపించేది. అప్ప‌ట్లో టాలీవుడ్ ద‌ర్శ‌కుడు కే రాఘ‌వేంద్ర‌రావు స‌హా ప‌లువురు సౌతిండియా ద‌ర్శ‌కులు క‌థానాయిక‌ల‌ బొడ్డుపై పాలు పండ్లు పూలు వేసి రొమాంటిసైజ్ చేసేవారు. అది కేవ‌లం ఆడియెన్ అభిరుచి మేర‌కు ద‌ర్శ‌కుల ఎంపిక‌. అయితే అప్ప‌ట్లో ఒక్క హీరోయిన్ కూడా ఈ త‌ర‌హా చిత్రీక‌ర‌ణ‌లు చేసే ద‌ర్శ‌కుల‌పై ఆరోపించ‌లేదు. 

కానీ చాలా దూరం ప్ర‌యాణించాక‌, ద‌శాబ్ధాలు గ‌డిచిన త‌ర్వాత క‌థానాయిక‌లు ఇలా బ‌హిరంగ వేదిక‌ల‌పై ఆరోపించ‌డం చ‌ర్చ‌గా మారింది. ఇటీవ‌లి కాలంలో ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లేవీ లేవు. కాలంతో పాటే ద‌ర్శ‌కులు మారారు. ఇప్పుడు ఆరోపించ‌డానికి కొత్త విష‌యాలున్నాయి. సినిమా సెట్ల‌లో లైంగిక వేధింపులు, అసౌక‌ర్యాల‌పైనా క‌థానాయిక‌లు ఆరోపిస్తున్నారు.

Kannada actress sensational comments on directors:

Daisy Shah highlighted a strange trend in Kannada films

Tags:   DAISY SHAH
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ