అనుపమ పరమేశ్వరన్ సక్సెస్ కు పరదా చిత్రం బ్రేకులు వేసింది. లిల్లీ గా ఎన్నడూ లేని విధంగా బోల్డ్ కేరెక్టర్ లో టిల్లు స్క్వేర్ లో చెలరేగిపోయిన అనుపమ పరమేశ్వరన్ కు ఆ చిత్రం మంచి హిట్ అందించింది. ఆతర్వాత డ్రాగన్ చిత్రంతో హిట్ కొట్టింది. ప్రదీప్ రంగనాధన్ డ్రాగన్ చిత్రంలో అనుపమ వన్ ఆఫ్ ద హీరోయిన్.. అయినప్పటికి ఆ చిత్ర సక్సెస్ అనుపమ ఖాతాలో పడింది.
ఈమధ్యనే మలయాళంలో తెరకెక్కిన జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ చిత్రం తో మంచి హిట్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గా లేడీ ఓరియెంటెడ్ చిత్ర పరదా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ శుక్రవారమే విడుదలైన పరదా చిత్రానికి రెండు రోజుల ముందే మేకర్స్ ఓవర్ కాన్ఫిడెంట్ తో ప్రీమియర్స్ వేసేసారు.
పరదా ప్రీమియర్స్ కి యావరేజ్ టాక్ రావడంతో పరదా చిత్రానికి మినిమమ్ ఓపెనింగ్స్ లేకుండా పోయాయి. అసలే హీరోయిన్ సెంట్రిక్ మూవీ. యావరేజ్ టాక్ వచ్చిన సినిమాని థియేటర్స్ వెళ్లి చూసే మూడ్ లో ఈ మద్యన ప్రేక్షకులు కనిపించడం లేదు. సుబ్బు పాత్రని బలంగా నమ్మింది అనుపమ.. ఆ పాత్రలో వీలైనంతగా పరకాయ ప్రవేశం చేయడానికి ప్రయత్నించింది.
కానీ కథ, కథనాలు తేలిపోవడంతో పరదా అసలు కథ మరుగున పడిపోయింది. మరి పరదా చిత్రానికి క్రిటిక్స్ నుంచే కాదు ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ రాకపోవడంతో సినిమా రిజల్ట్ ఏమిటి అనేది క్లారిటీ వచ్చేసింది. పాపం అనుపమ సక్సెస్ కు పరదా బ్రేకులు వేసినట్లే కదా.